
సూపర్‌స్టార్‌తో నయన నాల్గోసారి..
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నేటి క్రేజీ నటి నయనతార మరోసారి జత క ట్టనున్నారా? అలాంటి అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలోనైనా నటించాలని చాలా మంది యువ కథానాయకులు కోరుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రంలో చిన్న పాత్ర అయినా లభిస్తే చాలని ఆశ పడేవారెందరో. అంత దాకా ఎందుకు నటి త్రిష రజనీకాంత్‌తో నటించే అవకాశం కోసం చాలా కాలంగానే ఎదురు చూస్తున్నారు.
ఈ విషయాన్ని ఇటీవల ఆమె స్వయంగా ఒక భేటీలో పేర్కొన్నారు. ఇక అందాల తార హన్సిక కూడా రజనీతో కలిసి నటించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తన మనసులోని మాటను స్పష్టం చేసింది. లక్కీ హీరోయిన్ నయనతారకు సూపర్‌స్టార్‌తో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం అతి చేరువలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఈ అమ్మడు ఇప్పటికే రజనీకాంత్‌తో చంద్రముఖి, శివాజీ, కుచేలన్ చిత్రాలలో నటించారు. వీటిలో శివాజీ చిత్రంలో సూపర్‌స్టార్‌తో సింగిల్ సాంగ్‌లోనే స్టెప్స్ వేశారన్నది గమనార్హం. రజనీకాంత్ ప్రస్తుతం కబాలి, 2.ఓ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో కబాలి చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే చివరి వారంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా రజనీకాంత్ తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, మలయాళంలో మమ్ముట్టి నయనతార జంటగా నటించిన హిట్ చిత్రం భాస్కర్ ది రాస్కెల్ చిత్ర తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే ఈ ముద్దుగుమ్మ సూపర్‌స్టార్‌తో నాలుగోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లే. అయితే భాస్కర్ ది రాస్కెల్ చిత్ర రీమేక్‌లో నటించే విషయమై రజనీ వర్గం నుంచి ఎలాంటి స్పందన లేదన్నది గమనార్హం.