
రజనీ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. ఇలా ఇన్సూరెన్స్ చేసిన తొలి తమిళ చిత్రం బహుశా ఇదే కావొచ్చు. రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి కబాలి, మరొకటి 2.ఓ.ఇది ఎందిరన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. స్టార్ దర్శకుడు శంకర్ మరో అద్భుతానికి పూనుకున్న చిత్రం ఇది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్‌గా నటించడం విశేషం.
నీరవ్‌షా చాయాగ్రహణం, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతంతో పాటు, హాలీవుడ్ సాంకేతికనిపుణులు పనిచేస్తున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ రూ.350 కోట్లతో బ్రహ్మాండంగా నిర్మిస్తోంది.ఇంత భారీ బడ్జెట్‌లో తొలి తమిళ చిత్రం ఇదేననీ ఘంటాపథంగా చెప్పవచ్చు. విదేశీ స్టంట్ కళాకారులు, మేకప్ నిపుణులు,అబ్బుర పరచే సెట్స్ అంటూ నిరాటంకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ 350 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.