రజనీని కించపరిచే సన్నివేశాలుండవ్ | 'Lingaa' spoof film lead actor revealed!!! | Sakshi
Sakshi News home page

రజనీని కించపరిచే సన్నివేశాలుండవ్

Published Sun, Jul 5 2015 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

రజనీని కించపరిచే సన్నివేశాలుండవ్

రజనీని కించపరిచే సన్నివేశాలుండవ్

నా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కించపరిచే సన్నివేశాలు ఉండవని పవర్‌స్టార్ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఈయన గొడవేమిటంటారా? లింగా చిత్ర నష్టపరిహారం కోరుతూ ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ చేసిన ఆందోళన తెలిసిందే.ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాగా ఆ డిస్ట్రిబ్యూటర్ అందరూ కలిసి లింగా సమస్యను ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేయనున్నారు.ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్రను కామెడీ నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ పోషించనున్నారు.

కాగా ఇది రజనీకాంత్‌ను ఎగతాళి చేసే చిత్రం అనే ప్రచారం కోలీవుడ్‌లో హోరెత్తుతోంది. దీని గురించి పవర్‌స్టార్‌ను ప్రశ్నించగా లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లు నిర్మిస్తున్న చిత్రంలో తాను హీరోగా నటిస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే ఇది పూర్తిగా వినోదాత్మక కథా చిత్రం అని ఎవరినీ కించపరిచే చిత్రం కాదని పేర్కొన్నారు. వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన నాకు అనూహ్యంగా ఒక చిత్రం అపజయం పాలవుతుందన్నారు.

దీంతో ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ నష్టపరిహారం కోరతారన్నారు.వారికి నష్టపరిహారం చెల్లించేనా?లేదా?అన్నదే కథ అని చెప్పారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కించపరిచే విధంగా గానీ, ఎగతాళి చేసే సన్నివేశాలు గానీ ఈ చిత్రంలో ఉండవని చెప్పారు. ఆ నిబంధనతోనే తానీ చిత్రాన్ని అంగీకరించినట్లు ఆయన వివరించారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలో  హీరోయిన్‌గా నటి సదాను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement