Ridicule
-
వద్దమ్మా.. తప్పూ!
ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్‌కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్‌లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్‌ఫోన్స్‌తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా? -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్‌ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్‌కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్‌ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్‌ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్‌కు మోడలింగ్ చేసింది. మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్
భోపాల్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంటే..మధ్యప్రదేశ్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ ఒకరు నిర్లక్ష్యంగా ప్రవర్తించి, చివరకు మహమ్మారి కోరలకు చిక్కాడు. మాస్క్ లను ధరించడాన్ని ఎగతాళి చేశాడు. మాస్క్ లను కాదు దేవుడ్నినమ్ముకోండి అంటూ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలికాడు. ప్రస్తుతం అతగాడు ఇపుడిక దేవుడే దిక్కు అంటూ ఆసుపత్రి బెడ్ మీదకు చేరాడు. తన చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేశాడు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా నాకోసం ప్రార్థించండి అంటూ మరో రెండు వీడియోలను అప్లోడ్ చేశాడు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) కోవిడ్-19 నుండి రక్షణ కోసం ముసుగులు ఉపయోగించడాన్ని ఎగతాళి చేసిన 25 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది. జబల్పూర్ లోని తన సోదరి ఇంటికి వెళ్లిన తరువాత ఈ యువకుడికి కరోనా లక్షణాలు కల్పించడంతో పరీక్షలు నిర్వహించారు. చివరికి పాజిటివ్ అని తేలడంతో బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి పాలైన తరువాత కూడా వార్డు నుండే వీడియోలను అప్లోడ్ చేశాడు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ తన అనుచరులను కోరాడు. కరోనా వైరస్ కారణంగా టిక్‌టాక్ వీడియోలను అప్లోడ్ చేయలేను. దయచేసి మద్దతుగా నిలవండి..నా కోసం ప్రార్థించండి అంటూ వీడియోల్లో వేడుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసు అధికారులు ఎట్టకేలకు శుక్రవారం అతని ఫోన్‌ను లాక్కున్నారు. అంతేకాదు అతని బాధ్యతా రాహిత్యానికిగాను వైద్య సిబ్బంది, కుటుంబం, పొరుగువారితో సహా 50 మంది నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. కాగా సాగర్ జిల్లాలో ప్రాణాంతక వైరస్ వచ్చిన మొదటి కేసు ఇదే కావడంతో కలెక్టర్ ప్రీతి మైథిల్ ప్రజలను భయపడవద్దని కోరుతూ ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఆందోళన అవసరం లేదని రోగి ఆరోగ్యపరిస్థితి స్థిరంగా ఉందని ప్రకటించారు. చదవండి : రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం -
అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ ఎందుకు?
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్తాన్‌లో భద్రతను పట్టించుకోకుండా భారత ప్రధాని మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. అఫ్గాన్ భద్రతకు భారత్ సహా ఇతర దేశాలు చేయాల్సినంతగా చేయలేదని విమర్శించారు. అఫ్గానిస్తాన్‌కు బలగాలు పంపాలని అమెరికా తరచూ ఒత్తిడి చేస్తున్నా భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌లో భారత్ చేపట్టిన అభివృద్ధి పనుల్ని అమెరికా అధ్యక్షుడు పరిహసిస్తూ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ట్రంప్ ఏ లైబ్రరీ ప్రాజెక్టును ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అఫ్గానిస్తాన్ భద్రతకు చేస్తున్న ఖర్చుపై మాట్లాడుతూ ట్రంప్..భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారు. ‘ మోదీని కలిసినప్పుడు అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ నిర్మిస్తున్నానని పదేపదే చెప్పారు. మోదీ లాంటి నాయకులు అఫ్గానిస్తాన్ అభివృద్ధికి ఎంతో ఖర్చు చేశామని చెబుతున్న మొత్తం మనం చేస్తున్న వ్యయం కన్నా చాలా తక్కువ. ఆ లైబ్రరీని ఆ దేశంలో ఎవరైనా వినియోగిస్తున్నారా? నాకైతే తెలీదు. అయినా లైబ్రరీ ఏర్పాటుచేసినందుకు మనం భారత్‌కు ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చింది. మనం అక్కడ ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం’ అని ట్రంప్ వెటకారంగా అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ కొట్టివేసింది. భారత్ చేస్తున్న సాయం ఆ దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది. అఫ్గాన్ ప్రజల అవసరాల మేరకు పలు మౌలిక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల్ని అమలుచేస్తున్నామంది. లాటరీకి ముగింపు పలకాలి ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారికే అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ ట్రంప్ స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. లాటరీ విధానంలో వీసాలు ఇవ్వడం సరికాదని.. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. -
పాదుకలకే పట్టం
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు. ఓరోజు వైకుంఠవాసుడి శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది. కించపరిచింది.‘‘నేను విష్ణుమూర్తి శిరస్సుపై దర్జాగా ఉన్నాను. నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు... అంతెందుకు మనుషులు కూడా నిన్ను తొడుక్కుని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతేసుమా. కానీ నా విషయానికి వస్తాను... నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు’’ అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం. అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగలేదు. కానీ విష్ణుమూర్తి ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి.పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు ‘‘పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధ పడుతున్నారు... మిమ్మల్ని నేనెప్పుడూ తక్కువ చేయలేదుగా... కిరీటం చెప్పిన మాటలకా బాధపడుతున్నారు...’’ అని అడిగాడు. వెంటనే పాదరక్షలు తన గోడునంతా మళ్ళీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు ‘‘ఇందుకా బాధ పడుతున్నారు... దాన్ని మరచిపొండి... కిరీటం మాటలు పట్టించుకోకండి... నేనురామావతారంలో మిమ్మల్ని పద్నాలుగేళ్ళపాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను. సరేనా...’’ అని హామీ ఇచ్చాడు.ఆ మేరకే రాముడుగా అవతారమెత్తినప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజూ సింహాసనం ముందు కూర్చుని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరచి మాటాడినందుకు మానసికంగా బాధపడింది. ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు. – వై. సాత్యకి -
లండన్ తుపాకీ చట్టాల్ని తప్పుపట్టిన ట్రంప్
లండన్: అమెరికాలో తన ప్రభుత్వం అనుసరిస్తోన్న తుపాకీ సంస్కృతిని సమర్థిస్తూ.. మరోవైపు లండన్‌లోని కఠినమైన తుపాకీ చట్టాల్ని హేళన చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం డాలస్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ‘లండన్‌లో జరిగిన ఒక అంశం గురించి ఇటీవల చదివాను. అక్కడ నమ్మలేనంత కఠినంగా తుపాకీ చట్టాలున్నాయి. అందువల్ల కత్తిపోటు గాయాలతో చేరిన జనాలతో ఒకప్పటి ప్రముఖ ఆస్పత్రి యుద్ధభూమిని తలపించిందట. ఎందుకంటే వారికి తుపాకులు లేవు.. కత్తులే ఉన్నాయి’ అని అపహాస్యం చేస్తూ మాట్లాడారు. ద.కొరియా అధ్యక్షుడు మూన్తో 22న ట్రంప్ భేటీ మరోవైపు, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల22న సమావేశం కానున్నారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో జరిగే ఈ భేటీ సందర్భంగా ఉ.కొరియా అధినేత కిమ్‌తో గత వారం చర్చించిన అంశాలను మూన్ వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కిమ్‌తో జరగబోయే భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలనూ ట్రంప్, మూన్‌లు చర్చించనున్నారు. -
రజనీని కించపరిచే సన్నివేశాలుండవ్
నా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కించపరిచే సన్నివేశాలు ఉండవని పవర్‌స్టార్ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఈయన గొడవేమిటంటారా? లింగా చిత్ర నష్టపరిహారం కోరుతూ ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ చేసిన ఆందోళన తెలిసిందే.ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాగా ఆ డిస్ట్రిబ్యూటర్ అందరూ కలిసి లింగా సమస్యను ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేయనున్నారు.ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్రను కామెడీ నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ పోషించనున్నారు. కాగా ఇది రజనీకాంత్‌ను ఎగతాళి చేసే చిత్రం అనే ప్రచారం కోలీవుడ్‌లో హోరెత్తుతోంది. దీని గురించి పవర్‌స్టార్‌ను ప్రశ్నించగా లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లు నిర్మిస్తున్న చిత్రంలో తాను హీరోగా నటిస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే ఇది పూర్తిగా వినోదాత్మక కథా చిత్రం అని ఎవరినీ కించపరిచే చిత్రం కాదని పేర్కొన్నారు. వరుసగా సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన నాకు అనూహ్యంగా ఒక చిత్రం అపజయం పాలవుతుందన్నారు. దీంతో ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ నష్టపరిహారం కోరతారన్నారు.వారికి నష్టపరిహారం చెల్లించేనా?లేదా?అన్నదే కథ అని చెప్పారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కించపరిచే విధంగా గానీ, ఎగతాళి చేసే సన్నివేశాలు గానీ ఈ చిత్రంలో ఉండవని చెప్పారు. ఆ నిబంధనతోనే తానీ చిత్రాన్ని అంగీకరించినట్లు ఆయన వివరించారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటి సదాను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.