
లండన్: అమెరికాలో తన ప్రభుత్వం అనుసరిస్తోన్న తుపాకీ సంస్కృతిని సమర్థిస్తూ.. మరోవైపు లండన్‌లోని కఠినమైన తుపాకీ చట్టాల్ని హేళన చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం డాలస్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్‌ఆర్‌ఏ) సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.
‘లండన్‌లో జరిగిన ఒక అంశం గురించి ఇటీవల చదివాను. అక్కడ నమ్మలేనంత కఠినంగా తుపాకీ చట్టాలున్నాయి. అందువల్ల కత్తిపోటు గాయాలతో చేరిన జనాలతో ఒకప్పటి ప్రముఖ ఆస్పత్రి యుద్ధభూమిని తలపించిందట. ఎందుకంటే వారికి తుపాకులు లేవు.. కత్తులే ఉన్నాయి’ అని అపహాస్యం చేస్తూ మాట్లాడారు.
ద.కొరియా అధ్యక్షుడు మూన్‌తో 22న ట్రంప్ భేటీ
మరోవైపు, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల22న సమావేశం కానున్నారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో జరిగే ఈ భేటీ సందర్భంగా ఉ.కొరియా అధినేత కిమ్‌తో గత వారం చర్చించిన అంశాలను మూన్ వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కిమ్‌తో జరగబోయే భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలనూ ట్రంప్, మూన్‌లు చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment