Power Star Srinivasan
-
ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్
పెరంబూరు: నటుడు సూపర్‌స్టార్ శ్రీనివాసన్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌గా మార్చేశారు. సినిమా క్రేజ్ ఉంది కదా అని అందరూ రాజకీయ నాయకులైపోయి ఏలేద్దాం అనుకుంటే కుదరదు. అలా ఆశపడిన హాస్యనటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఓటర్ల చేతిలో ఘోరంగా భంగపడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున దక్షిణ చెన్నై స్థానానికి పోటీ చేశారు. తన విజయం ఖాయమని, లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు పొందారు. కేవలం 670 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్ అని అభిమానులు ఎగతాలి చేస్తున్నారు. -
పవర్‌స్టార్ కిడ్నాపయ్యారా?
పెరంబూరు: నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ ను కందువడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేశారా? ఆయన కూతురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రను పోషించి ప్రాచుర్యం పొందారు. అయితే ఈయనపై పలు ఆర్థిక పరమైన కేసులు ఉన్నాయి. ఆ మధ్య అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకు కూడా వెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చారు. గురువారం ఉదయం పవర్‌స్టార్ శ్రీనివాసన్ అనూహ్యంగా కనిపించకుండాపోయారు. దీంతో ఆయన భార్య అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శ్రీనివాసన్‌కు ఫోన్ చేయగా తాను ఊటీలో ఉన్నట్లు చెప్పారు. ఆయకు అక్కడ ఒక బంగ్లా ఉంది. దాన్ని అమ్మే విషయమై వెళ్లినట్లు సమాచారం. శనివారం ఉదయం శ్రీనివాసన్ కూతురు వైష్ణవి చెన్నైలో విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె గత 5వ తేదీన పోలీసులమని చెప్పి కొందరు తన తండ్రిని నగరంలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారని కారు డ్రైవర్ చెప్పినట్లు తెలిపింది. దీంతో తాను వెంటనే తన తండ్రి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ అని వచ్చిందంది. ఆ రోజు సాయంత్రం తన తండ్రి ఫోన్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి చెన్నైలోని ఒక ఆస్పత్రి వద్దకు రావలసిందిగా చెప్పాడని తెలి పింది. తన తల్లి ఆ ప్రాంతానికి వెళ్లగా ఆస్తులకు సంబంధించిన వివరాలను వాయిస్ రికార్డు చేసి నీ భర్తను పంపేస్తామని వాళ్లు చెప్పినట్లు తెలిపిం ది. బెంగళూర్‌కు చెందిన ఒక వడ్డీ వ్యాపారి వద్ద తన తండ్రి డబ్బు అప్పు తీసుకున్నారని, ఆ వ్యక్తే తన తండ్రిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని వైష్ణవి అం ది. పోలీసులు తన తండ్రి వ్యవహారం గురించి పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. -
తమిళ పవర్‌స్టార్ అదృశ్యం
చెన్నై, పెరంబూరు: నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ గురువారం అనూహ్యంగా కనిపించకుండాపోయారు. దీంతో భార్య అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లత్తికా అనే చిత్రం ద్వారా నటుడిగా, నిర్మాతగా సినీరంగానికి పరిచయం అయ్యారు. సంతానం హీరోగా నటించిన కన్నా లడ్డు తిన్న ఆశైయా చిత్రంలో ఆయనకు స్నేహితుడిగా హాస్య పాత్రలో నటించి గుర్తింపు పొందారు. ఆ తరువాత పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌స్టార్ శ్రీనివాసన్‌పై పలు ఆర్థికమోసాల కేసులు ఉన్నాయి. ఈయన ఒక కేసులో అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లొచ్చారు కూడా. కాగా గురువారం సాయంత్రం పవర్‌స్టార్ శ్రీనివాసన్ భార్య లూసీ తన భర్త కనిపించకుండా పోయారని స్థానిక అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందుంలో శుక్రవారం ఉదయం తన భర్త మిత్రుడి ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లారని, ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఎవరో గుర్తు తెలియని కొందరు తనకు ఫోన్ చేసి నీ భర్త పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తమ పేరుకు రాయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. తన భర్తను కనుగొని తనకు అప్పగించాల్సిందిగా లూసీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దార్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఊటీలో ఉన్నట్లు తెలిసిందట. ఆయనకు ఊటీలో ఒక బంగ్లా ఉందది, ఆర్థిక సమస్యల కారణంగా ఆ బంగ్లాను అమ్మడానికి శ్రీనివాసన్ ఊటీకి వెళ్లినట్లు పోలీసుల సమాచారం. -
కామెడీ విలన్‌గా పవర్‌స్టార్
పవర్‌స్టార్ శ్రీనివాసన్ కామెడీ విలన్‌గా నటిస్తున్న చిత్రం జెయిక్కపోవదు యారు. ఇంతకు ముందు అదిశయ ఉలగం చిత్రాన్ని నిర్మించిన టిట్టు ప్రొడక్షన్స్ అధినేత ఆర్.భానుచిత్ర తాజాగా నిర్మిస్తున్న చిత్రం జెయిక్కపోవదు యారు. నటుడు పాండిరాజన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో శక్తిస్కాట్ హీరోగానూ ఆయనకు జంటగా వందన అనే నవ నటి హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇతర పాత్రల్లో చైతన్య, ఆద్విక్, శ్యామ్‌సుందర్, సతీష్రామక్రిష్ణన్, కోటి, వెంకట్, సోనాల్ బెనర్జీ, సైయద్ నటిస్తున్నారు. దీనికి కథ, కథనం, మాటలు, ఎడిటింగ్, చాయాగ్రహణం,దర్శకత్వం బాధ్యతల్ని శక్తిస్కాట్ నిర్వహిస్తున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ కారు రేస్, బైక్ రేస్‌లపై ప్రభుత్వ నిషేదాజ్ఞలు ఉన్నా అనధికారికంగా అవి జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ రేస్‌ల కారణంగా ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను పూర్తిగా వినోదభరితంగా ఆవిష్కరించే చిత్రం జెయిక్కపోవదు యారు అని తెలిపారు. ఇందులో ఐదు గ్రూపులు పాల్గొని హాస్యంతో కడుపుబ్బ నవ్విస్తారన్నారు. మూడు కార్లు, ఒక్క ఆటో, ఒక్క జీపులతో సీరియస్ విషయాలను కామెడీగా చెబుతున్నామని అన్నారు. చిత్ర షూటింగ్‌ను బెంగళూర్, దిండివనం, ఆర్కాడ్ ప్రాంతాల్లో నిర్వహించినట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి ఆండన్ జెప్రిన్, శక్తిస్కాట్లు సంగీతాన్ని అందిస్తున్నారు. -
రజనీని కించపరిచే సన్నివేశాలుండవ్
నా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కించపరిచే సన్నివేశాలు ఉండవని పవర్‌స్టార్ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఈయన గొడవేమిటంటారా? లింగా చిత్ర నష్టపరిహారం కోరుతూ ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ చేసిన ఆందోళన తెలిసిందే.ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాగా ఆ డిస్ట్రిబ్యూటర్ అందరూ కలిసి లింగా సమస్యను ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేయనున్నారు.ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్రను కామెడీ నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ పోషించనున్నారు. కాగా ఇది రజనీకాంత్‌ను ఎగతాళి చేసే చిత్రం అనే ప్రచారం కోలీవుడ్‌లో హోరెత్తుతోంది. దీని గురించి పవర్‌స్టార్‌ను ప్రశ్నించగా లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లు నిర్మిస్తున్న చిత్రంలో తాను హీరోగా నటిస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే ఇది పూర్తిగా వినోదాత్మక కథా చిత్రం అని ఎవరినీ కించపరిచే చిత్రం కాదని పేర్కొన్నారు. వరుసగా సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన నాకు అనూహ్యంగా ఒక చిత్రం అపజయం పాలవుతుందన్నారు. దీంతో ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ నష్టపరిహారం కోరతారన్నారు.వారికి నష్టపరిహారం చెల్లించేనా?లేదా?అన్నదే కథ అని చెప్పారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కించపరిచే విధంగా గానీ, ఎగతాళి చేసే సన్నివేశాలు గానీ ఈ చిత్రంలో ఉండవని చెప్పారు. ఆ నిబంధనతోనే తానీ చిత్రాన్ని అంగీకరించినట్లు ఆయన వివరించారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటి సదాను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.