కామెడీ విలన్గా పవర్స్టార్ | power star srinivasan as comedy star in jekkayi povadu yaaru | Sakshi
Sakshi News home page

కామెడీ విలన్గా పవర్స్టార్

Published Sun, Apr 17 2016 3:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

కామెడీ విలన్గా పవర్స్టార్

కామెడీ విలన్గా పవర్స్టార్

పవర్‌స్టార్ శ్రీనివాసన్ కామెడీ విలన్‌గా నటిస్తున్న చిత్రం జెయిక్కపోవదు యారు. ఇంతకు ముందు అదిశయ ఉలగం చిత్రాన్ని నిర్మించిన టిట్టు ప్రొడక్షన్స్ అధినేత ఆర్.భానుచిత్ర తాజాగా నిర్మిస్తున్న చిత్రం జెయిక్కపోవదు యారు. నటుడు పాండిరాజన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో శక్తిస్కాట్ హీరోగానూ ఆయనకు జంటగా వందన అనే నవ నటి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇతర పాత్రల్లో చైతన్య, ఆద్విక్, శ్యామ్‌సుందర్, సతీష్‌రామక్రిష్ణన్, కోటి, వెంకట్, సోనాల్ బెనర్జీ, సైయద్ నటిస్తున్నారు. దీనికి కథ, కథనం, మాటలు, ఎడిటింగ్, చాయాగ్రహణం,దర్శకత్వం బాధ్యతల్ని శక్తిస్కాట్ నిర్వహిస్తున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ కారు రేస్, బైక్ రేస్‌లపై ప్రభుత్వ నిషేదాజ్ఞలు ఉన్నా అనధికారికంగా అవి జరుగుతూనే ఉన్నాయన్నారు.

ఈ రేస్‌ల కారణంగా ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను పూర్తిగా వినోదభరితంగా ఆవిష్కరించే చిత్రం జెయిక్కపోవదు యారు అని తెలిపారు. ఇందులో ఐదు గ్రూపులు పాల్గొని హాస్యంతో కడుపుబ్బ నవ్విస్తారన్నారు. మూడు కార్లు, ఒక్క ఆటో, ఒక్క జీపులతో సీరియస్ విషయాలను కామెడీగా చెబుతున్నామని అన్నారు. చిత్ర షూటింగ్‌ను బెంగళూర్, దిండివనం, ఆర్కాడ్ ప్రాంతాల్లో నిర్వహించినట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి ఆండన్ జెప్రిన్, శక్తిస్కాట్‌లు సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement