ఇండో - చైనీస్ సినిమాలో...! | Sonu Sood to play King Harshavardhan in an Indo-Chinese | Sakshi
Sakshi News home page

ఇండో - చైనీస్ సినిమాలో...!

Published Sun, Sep 27 2015 11:20 PM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

ఇండో - చైనీస్ సినిమాలో...! - Sakshi

ఇండో - చైనీస్ సినిమాలో...!

సోనూ సూద్ అంటే విలన్‌గానే ఇక్కడికి వారికి పరిచయం. అడపా దడపా కామెడీ విలన్‌గా కూడా ఆయన అలరిస్తుంటారు. దక్షిణ, ఉత్తరాది భాషలవారికి విలన్‌గా సుపరిచితుడైన సోను చైనీస్ ప్రేక్షకులకు మాత్రం చక్రవర్తిగా పరిచయం కానున్నారు. ‘గ్జువాన్ జాంగ్’ అనే ఇండో చైనీస్ సినిమాలోనే ఆయన ఈ పాత్ర చేస్తున్నారు. పూర్వకాలంలో భారత్‌కు, చైనాకు ఉన్న సంబంధాల గురించి పరిశోధన చేసిన  ‘గ్జువాన్‌జాంగ్’ అనే బౌద్ధ గురువు జీవితం చుట్టూ తిరిగే కథగా హ్యూ జియాంక్వి అనే చైనీస్ దర్శకుడు ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నారు.  

పుష్యభూతి రాజవంశానికి చెందిన హర్షవర్ధనుడు అనే చక్రవర్తి  పాత్రలో సోనూసూద్ కనిపించనున్నారు. ‘‘అమ్మ హిస్టరీ ప్రొఫెసర్ కావడంతో ఈ పాత్ర గురించి మరింతగా అర్థం చేసుకున్నాను’’ అని సోనూ సూద్ అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఔరంగాబాద్‌లోని దౌలతాబాద్‌లో చిత్రీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement