Indo-Chinese Film
-
ఇండో-చైనీస్ సినిమాలో...
సల్మాన్‌ఖాన్ వచ్చే రంజాన్‌కు ‘సుల్తాన్’ చిత్రంతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘సుల్తాన్’ తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. అది ఇండో-చైనీస్ చిత్రం కావడం విశేషం. రిలీజ్ డేట్‌తో పక్కాగా ఈ సినిమా గురించి ప్రకటించేశారు కూడా. ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకున్న ‘బజ్రంగీ భాయీజాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెర కెక్కించనున్నారు. భారత్ నుంచి చైనా ప్రయాణంలో ఓ యువకునికి ఎదురైన అనుభవాలతో ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందనుందట. ఇందులో దీపికా పదుకొనేతో పాటు ఓ చైనీస్ బ్యూటీతో కలసి సల్మాన్‌ఖాన్ రొమాన్స్ చేయనున్నారని సమాచారం. సల్మాన్‌ఖాన్, కబీర్‌ఖాన్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చే యనున్నారు. -
ఇండో - చైనీస్ సినిమాలో...!
సోనూ సూద్ అంటే విలన్‌గానే ఇక్కడికి వారికి పరిచయం. అడపా దడపా కామెడీ విలన్‌గా కూడా ఆయన అలరిస్తుంటారు. దక్షిణ, ఉత్తరాది భాషలవారికి విలన్‌గా సుపరిచితుడైన సోను చైనీస్ ప్రేక్షకులకు మాత్రం చక్రవర్తిగా పరిచయం కానున్నారు. ‘గ్జువాన్ జాంగ్’ అనే ఇండో చైనీస్ సినిమాలోనే ఆయన ఈ పాత్ర చేస్తున్నారు. పూర్వకాలంలో భారత్‌కు, చైనాకు ఉన్న సంబంధాల గురించి పరిశోధన చేసిన ‘గ్జువాన్‌జాంగ్’ అనే బౌద్ధ గురువు జీవితం చుట్టూ తిరిగే కథగా హ్యూ జియాంక్వి అనే చైనీస్ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్యభూతి రాజవంశానికి చెందిన హర్షవర్ధనుడు అనే చక్రవర్తి పాత్రలో సోనూసూద్ కనిపించనున్నారు. ‘‘అమ్మ హిస్టరీ ప్రొఫెసర్ కావడంతో ఈ పాత్ర గురించి మరింతగా అర్థం చేసుకున్నాను’’ అని సోనూ సూద్ అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఔరంగాబాద్‌లోని దౌలతాబాద్‌లో చిత్రీకరించారు.