ఇండో-చైనీస్ సినిమాలో... | salman khan in Indo-Chinese film | Sakshi
Sakshi News home page

ఇండో-చైనీస్ సినిమాలో...

Published Mon, Apr 11 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

ఇండో-చైనీస్ సినిమాలో...

ఇండో-చైనీస్ సినిమాలో...

సల్మాన్‌ఖాన్ వచ్చే రంజాన్‌కు ‘సుల్తాన్’ చిత్రంతో  సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘సుల్తాన్’ తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. అది ఇండో-చైనీస్ చిత్రం కావడం విశేషం.  రిలీజ్ డేట్‌తో పక్కాగా ఈ సినిమా గురించి ప్రకటించేశారు కూడా.  ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకున్న ‘బజ్‌రంగీ భాయీజాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెర కెక్కించనున్నారు. భారత్ నుంచి చైనా ప్రయాణంలో ఓ యువకునికి ఎదురైన అనుభవాలతో ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందనుందట.  

ఇందులో దీపికా పదుకొనేతో పాటు ఓ చైనీస్ బ్యూటీతో కలసి సల్మాన్‌ఖాన్ రొమాన్స్ చేయనున్నారని సమాచారం. సల్మాన్‌ఖాన్, కబీర్‌ఖాన్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చే యనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement