పవర్‌స్టార్‌ కిడ్నాపయ్యారా? | Actor 'Power Star' Srinivasan & his wife kidnapped for ransom | Sakshi
Sakshi News home page

పవర్‌స్టార్‌ కిడ్నాపయ్యారా?

Published Sun, Dec 9 2018 12:15 PM | Last Updated on Sun, Dec 9 2018 12:16 PM

Actor 'Power Star' Srinivasan & his wife kidnapped for ransom - Sakshi

పెరంబూరు: నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ ను కందువడ్డీ వ్యాపారులు కిడ్నాప్‌ చేశారా? ఆయన కూతురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రను పోషించి ప్రాచుర్యం పొందారు. అయితే ఈయనపై పలు ఆర్థిక పరమైన కేసులు ఉన్నాయి. ఆ మధ్య అరెస్ట్‌ అయ్యి తీహార్‌ జైలుకు కూడా వెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చారు. గురువారం ఉదయం పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ అనూహ్యంగా కనిపించకుండాపోయారు. దీంతో ఆయన భార్య అన్నానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శ్రీనివాసన్‌కు ఫోన్‌ చేయగా తాను ఊటీలో ఉన్నట్లు చెప్పారు. ఆయకు అక్కడ ఒక బంగ్లా ఉంది. దాన్ని అమ్మే విషయమై వెళ్లినట్లు సమాచారం.

 శనివారం ఉదయం శ్రీనివాసన్‌ కూతురు వైష్ణవి చెన్నైలో విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె గత 5వ తేదీన పోలీసులమని చెప్పి కొందరు తన తండ్రిని నగరంలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారని కారు డ్రైవర్‌ చెప్పినట్లు తెలిపింది. దీంతో తాను వెంటనే తన తండ్రి సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ అని వచ్చిందంది. ఆ రోజు సాయంత్రం తన తండ్రి ఫోన్‌ నుంచి ఒక వ్యక్తి ఫోన్‌ చేసి చెన్నైలోని ఒక ఆస్పత్రి వద్దకు రావలసిందిగా చెప్పాడని తెలి పింది. తన తల్లి ఆ ప్రాంతానికి వెళ్లగా ఆస్తులకు సంబంధించిన వివరాలను వాయిస్‌ రికార్డు చేసి నీ భర్తను పంపేస్తామని వాళ్లు చెప్పినట్లు తెలిపిం ది. బెంగళూర్‌కు చెందిన ఒక వడ్డీ వ్యాపారి వద్ద తన తండ్రి డబ్బు అప్పు తీసుకున్నారని, ఆ వ్యక్తే తన తండ్రిని కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని వైష్ణవి అం ది. పోలీసులు తన తండ్రి వ్యవహారం గురించి పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement