
రజనీ క్రేజ్ లో రాస్ టెయిలర్, దినేష్ కార్తిక్
అభిమానుల మధ్య క్రికెట్ క్రీడాకారులకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి యువ క్రికెట్ క్రీడాకారులు సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభమానులుకావడం విశేషం.
అభిమానుల మధ్య క్రికెట్ క్రీడాకారులకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి యువ క్రికెట్ క్రీడాకారులు సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభమానులుకావడం విశేషం. ఆ విధంగా ఇద్దరు క్రికెట్ క్రీడాకారులు రజనీ చిత్రం విడుదలైన తొలి రోజు తొలి ఆటను చూస్తామంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ క్రీడాకారులు దినేష్ కార్తిక్, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టెయిలర్‌లు. రజనీకాంత్ తాజా చిత్రం లింగా గురించి ట్విట్టర్‌లో తమ భావాలను పోస్ట్ చేశారు. వినాయక చతుర్థశి సందర్భంగా లింగా పోస్ట్‌ర్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో రజనీకాంత్ జీన్స్ పాంటు ధరించి స్టైల్‌గా నడిచివస్తున్నట్లుంది.
ఈ స్టిల్ చూసి ఆ చిత్రం విడుదలైన తొలి రోజు మొదటి షో చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తోందన్నారు. మరో క్రికెట్ కళాకారుడు రాస్ టెయిలర్ స్పందిస్తూ నువ్వు చాలా కరెక్ట్‌గా చెప్పావు దినేష్ తలైవర్ (నాయకుడు) చిత్రం చూడటానికి ఆ రోజు ఎలాంటి ఇతర వ్యాపకాలూ పెట్టుకోకుండా ఎదురు చూస్తుండండి. నేను కూడా లింగా చిత్రం చూడడానికి ఆసక్తిగా ఉన్నాను అని పేర్కొన్నారు. అలా ప్రతి ఒక్కరిలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న లింగా చిత్రం డిసెంబర్ 12న సూపర్‌స్టార్ పుట్టిన రోజు కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించిన విషయం అందరికీ తెల్సిందే.