నానటనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ చాయలు ఉండవచ్చని యువ నటుడు శివకార్తికేయన్ అంటున్నారు.
నానటనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ చాయలు ఉండవచ్చని యువ నటుడు శివకార్తికేయన్ అంటున్నారు. వరుత్త పడాద వాలిబర సంఘం, ఎదిర్ నీశ్చల్, మాన్ కరాటేవంటి వరుస విజయాలతో హేట్రిక్ కొట్టిన ఈయన తాజాగా పోలీసు గెటప్‌లో కాకిసట్టై అంటూ తెరపైకి రానున్నారు. తన ఉండర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిం చిన ఈ చిత్రానికి ఎదుర్‌నీశ్చల్ చిత్రం ఫేమ్ దురై సెంథి ల్‌కుమార్ దర్శకుడు. వరుత్తపడాద వాలిభర సంఘం చిత్రం తరువాత శ్రీ దివ్య మరోసారి శివకార్తికేయన్‌తో జతకట్టిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ పి.మదన్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు శివకార్తికేయన్ మాట్లాడు తూ తనగత చిత్రాలు కాస్త భిన్నంగా, కొత్తగా, వాణిజ్య విలువలను పెంచుతూ కాక్కిసట్టై చిత్రాన్ని చేశామని తెలిపారు. తన తండ్రి నిజాయితీ గల పోలీసు అధికారి అని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను పోలీసు అధికారి కావాలని ఆశించానన్నారు. అనివార్య కారణాల వలన ఆ కోరిక నెరవేరలేదని ఇప్పుడా ఆశను ఈ చిత్రం లో పోలీసు అధికారిగా నటించి తీర్చుకున్న ట్లు తెలిపారు. ఒక సామాన్యుడు పోలీసు అధికారిగా ఏమి చే శాడన్నది కాక్కిసట్టై చిత్ర ఇతివృత్తంగా పేర్కొన్నారు.
చిత్రంలో యాక్షన్, లవ్, కామెడీ అన్ని తగు పాళ్లలో ఉంటాయన్నారు. తన పాత్రను ఎక్కడ ఓవర్ బిల్డప్ లేకుండా దర్శక, నిర్మాతలు సమాలోచనలు చేసి తీర్చిదిద్దారన్నారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంలో మాదిరిగానే ఈ చిత్రంలోను హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందన్నారు. అదే విధంగా కొన్ని సన్నివేశాల్లో తన నటనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్స్ కనిపిస్తున్నాయని, ఆయన్ని అనుకరిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన చిత్రాలు చూస్తూ ఎదిగిన వాడిని. అందువలన ఆయన నటనా చాయలు ఉండవచ్చుగానీ అనుకరించ డం లేదని వివరించారు. ఈ సమావేశంలో దర్శకుడు దురై సెంథిల్‌కుమార్, పి.మదన్ తదితరులు పాల్గొన్నారు.