ఇళయదళపతి ప్రశంసలు | Ilayathalapathy Vijay proves why he is an awesome 'Nanban' | Sakshi
Sakshi News home page

ఇళయదళపతి ప్రశంసలు

Published Tue, Apr 21 2015 2:03 AM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

ఇళయదళపతి ప్రశంసలు - Sakshi

ఇళయదళపతి ప్రశంసలు

నటుడు, నృత్య దర్శకుడు, దర్శక నిర్మాత అంటూ బహు బాధ్యతలను అవలీలగా మోస్తూ విజయాలను అందుకుంటున్న

నటుడు, నృత్య దర్శకుడు, దర్శక నిర్మాత అంటూ బహు బాధ్యతలను అవలీలగా మోస్తూ విజయాలను అందుకుంటున్న లారెన్స్. తన చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు వికలాంగుల సమస్యలను, మనోభావాలను తెరపై చూపిస్తూ చక్కని సందేశానిచ్చే సన్నివేశాలను పొందుపరుస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. తాజా చిత్రం కాంచన - 2 చిత్రంలోను హార్రర్, థ్రిల్లర్ అంశాలతో పాటు హాస్యాన్ని కావలసినంత మోతాదులో జొప్పించారు. అలాగే నటి నిత్యామీనన్ పాత్ర ద్వారా వికలాంగుల మనోభావాలను చక్కగా ఆవిష్కరించారు. మరో హీరోయిన్‌గా తాప్సీ నటించిన ఈ చిత్రం విడుదలై చక్కని ప్రజాదరణను పొందుతోంది.
 
  కాంచన-2 చిత్రంలో లారెన్స్ ఏడేళ్ల పాప నుంచి 70 ఏళ్ల బామ్మ వరకు రకరకాల వేషాల్లో నటించి విడుదలకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందనలు అందుకున్న తరువాత ఇళయదళపతి విజయ్ ప్రశంసల్ని అందుకోవడం విశేషం. కాంచన-2 చిత్రం విజయం గురించి తెలుసుకున్న నటుడు విజయ్ లారెన్స్‌ను తన ఇంటికి పిలిపించుకుని మనస్పూర్తిగా ప్రశంసించారు. వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ నృత్యదర్శకత్వం వహించారు. ఏదేమైనా ఒక నటుడు చిత్రం విజయం సాధిస్తే మరో నటుడు అభినందించడం అన్నది సత్ సాంప్రదాయం. అది కోలీవుడ్‌లో కనిపించడం ఆహ్వానించదగ్గ విషయమే.
 5
 నాలో ఉన్న దాన్ని వాడుకోండి
 నాలో ఉన్న ప్రతిభను వాడుకోండి అంటున్నారు నటి సమంత. తొలి రోజుల్లో తమిళంలో చిత్ర పరిశ్రమలో నిరాశకు గురైనా తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుని విజయాన్ని అందుకున్న నటి సమంత. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు సినీ ప్రియుల గుండెలను గుల్ల చేసిన ఈ చెన్నై చిన్నది ఆ తరువాత అక్కడ వరుసగా విజయాలు అందుకున్నారు. ఈ వేగానికి ఒక దశలో అప్పటి వరకు టాప్ గేర్‌లో వెళుతున్న కాజల్ అగర్వాల్, అనుష్క లాంటి వారు కూడా ఖంగు తిన్నారు. అలా తెలుగులో ప్రముఖ హీరోయిన్ స్థానాన్ని అధిరోహించిన సమంత కత్తి చిత్రంతో సొంత గడ్డపైన సక్సెస్ సాధించారు. ప్రస్తుతం విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎండ్రదుకుళే చిత్రం విడుదల కోసం సమంత ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
 
 తొలి ద్విపాత్రాభినయం: గోలీసోడా వంటి చిన్న చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తి పెద్ద విజయాన్ని సాధించిన ఛాయాగ్రాహకుడు వేల్‌రాజ్ తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పత్తు ఎండ్రతుకుళే. ఈ చిత్రంలో సమంత ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఒక పాత్రలో అందాలను, మరో పాత్రలో అభినయాన్ని ఇరగదీశారట. సమంత నటనను చూసి విక్రమ్ కూడా విస్మయం చెందారట. దీంతో తనలోని మంచి నటి వున్న విషయాన్ని గ్రహించిన సమంత తనకు కథ వినిపించడానికి వచ్చే దర్శకులతో గ్లామర్‌తో పాటు తనలోని నటనా ప్రతిభను వాడుకోవడానికి ప్రయత్నించండి అంటూ క్లాస్ పీకుతున్నారట. త్వరలో విజయ్, సూర్య, ధనుష్, ఉదయనిధి స్టాలిన్ అంటూ స్టార్ హీరోలందరితోనూ నటించడానికి సిద్ధం అవుతున్న సమంత ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement