సూపర్‌స్టార్‌తో సై అంటుందా? | Katrina Kaif To Act With Rajinikanth? | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌తో సై అంటుందా?

Published Thu, Jul 16 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

సూపర్‌స్టార్‌తో సై అంటుందా?

సూపర్‌స్టార్‌తో సై అంటుందా?

 సూపర్‌సార్ట్ రజినీకాంత్ స్టార్ డెరైక్టర్ శంకర్ కాంబినేషన్‌లో శివాజీ, ఎందిరన్ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో మరో బ్రహ్మాండ చిత్రం రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర తారాగణం విషయంలో శంకర్ కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ దర్శకుడెప్పుడూ క్రేజీ కాంబినేషన్‌కు ప్రాధాన్యత నిస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఉత్తరాది బ్యూటీస్‌ని నటింపజేయడానికి ప్రయత్నిస్తారన్న విషయం ఆయన గత చిత్రాలను చూస్తే అర్థమవుతుంది.
 
 తొలి చిత్రం జెంటిల్‌మెన్ నుంచి ఇటీవల రూపొందించిన ఐ చిత్రం వరకూ ఇతర భాషా చిత్రాల భామలే అధికంగా కనిపిస్తారు. తాజా చిత్రానికి కూడా శంకర్ ఉత్తరాది ముద్దుగుమ్మలపైనే కన్నేవారు. ఎందిరన్-2 కోసం మొదట విద్యావాలన్ అనీ ఆ తరువాత దీపికాపడుకోనే అనీ ప్రచారం జరిగింది. తాజాగా మోస్ట్ బ్యూటిపుల్ అమ్మడు కత్రినాకైఫ్ పేరు తెరపై కొచ్చింది. ఈ జాణ ఆ మధ్య తమిళంలో మంచి అవకాశం వస్తే నటించడానికి రెడీ అని ప్రకటించింది.
 
  ఇప్పుడు శంకర్ ఎందిరన్-2లో ఆమెను రజినీకాంత్ సరసన నటింపజేయడానికి ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఇప్పటికే కత్రినాకైఫ్‌ను కలిసి చర్చించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. అయితే ఆమె ఇంకా పచ్చజెండా ఊపలేదట. కత్రినా సై అంటుందా? లేదా? అన్న ఆసక్తి చిత్రపరిశ్రమలో నెలకొంది. అలాగే రజినీకి విలన్‌గా అమీర్‌ఖాన్, షారూఖ్‌ఖాన్‌లతో పాటు హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను కూడా సంప్రదించిన ట్లు ప్రచారంలో ఉంది. చివరికి నటుడు విక్రమ్‌నే రజినీకి విలన్ చేస్తునట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement