లింగా చిత్రం హీరోయిన్ నేత్రదానం | Sonakshi Sinha Pledges To Donate Her Eyes | Sakshi
Sakshi News home page

లింగా చిత్రం హీరోయిన్ నేత్రదానం

Published Wed, Nov 5 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

లింగా చిత్రం హీరోయిన్ నేత్రదానం

లింగా చిత్రం హీరోయిన్ నేత్రదానం

లింగా చిత్ర హీరోయిన్ సోనాక్షి సిన్హా నేత్రదానం చేశారు. ఆ విధంగా ఆ బ్యూటీ సేవకుల జాబితాలో చేరారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయంతో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్న చిత్రం లింగా. ఈ చిత్రంలో ఆయనకు జంటగా అనుష్క, ముంబయి బ్యూటీ సోనాక్షి సిన్హా నటించారు. వీరిలో నటి సోనాక్షి సిన్హా నేత్రదానం చేశారు. హర్యానాకు చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు సోనాక్షి సిన్హా నేత్రదానం చేశారు. ఆ సంస్థ విజ్ఞప్తి మేరకు తాను నేత్రదానం చేసినట్లు ఈ ముద్దుగుమ్మ పేర్కొన్నారు. ఆ విధంగా సేవా విభాగంలో పాలు పంచుకునేందుకు ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే కమలహాసన్, మాధవన్,   స్నేహ, అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్, అమీర్ ఖాన్, కిరణ్‌రావ్‌లాంటి ప్రముఖులు నేత్రదానం చేశారు. ఈ పట్టికలో  సోనాక్షి సిన్హా చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement