కబాలి విడుదల ఎప్పుడో? | Kabali released when ? | Sakshi
Sakshi News home page

కబాలి విడుదల ఎప్పుడో?

Published Mon, Apr 25 2016 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

కబాలి విడుదల ఎప్పుడో?

కబాలి విడుదల ఎప్పుడో?

కబాలి చిత్రం రిలీజ్ ఎప్పుడు? అన్న ప్రశ్న దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు యావత్ సినీ ప్రపంచంలోనూ వ్యక్తం అవుతోంది. కారణం కూడా అందరికీ తెలిసిందే. అదే సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయనకు ఇండియాలోనే కాకుండా జపాన్, కెనడా,మలేషియా, సింగపూర్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. వారంతా కబాలి చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎస్ కబాలి చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ప్రెస్టేజియస్ చిత్రం కబాలి. రజనీకాంత్ సరసన రాధికాఆప్తే నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

చెన్నై, దుబాయ్, మలేషియా దేశాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ దాదాగా రెండు డైమన్షన్లలో కనిపించనున్నారు. అందులో ఒకటి సాల్ట్ పెప్పర్ గెటప్. ఈ గెటప్ ఇప్పటికే రజనీ అభిమానుల్లో ఆనందోత్సాహాలను రేకెత్తిస్తోంది. చిత్రంలో రజనీకాంత్‌కు పంచ్ డైలాగ్స్ లేక పోయినా ఆయన స్టైల్ మాత్రం అదరగొడతాయని దర్శకుడు రంజిత్ తెలియజేశారు. ఇటీవలే రజనీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. చిత్ర విడుదల ఎప్పుడన్న విషయాన్ని కూడా ఆయన సమీపకాలంలో వెల్లడిస్తూ మే చివరి వారంలో గానీ, జూన్ తొలి వారంలో గాని ఉంటుందని చెప్పారు. అయితే చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను మాత్రం విడుదల తేదీని స్పష్టంగా వెల్లడించలేదు.

ఇటీవలే విజయ్ హీరోగా నిర్మించిన తెరి చిత్రాన్ని విడుదల చేసి విజయాన్ని సాధించిన థాను ఆ చిత్రానికి సంబంధించి కొందరు డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారంలో తలనొప్పికి గురైయ్యారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కబాలి చిత్రం గురించి మాట్లాడుతూ చిత్రానికి రజనీకాంత్ ఇటీవల డబ్బింగ్‌ను పూర్తి చేశారని, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి విడుదల తేదీని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అయితే మే నెల 16న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి పాఠశాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ ఒత్తిడిలో మునిగిపోతారు. మరి ఆ సందర్భంలో కబాలి చిత్రాన్ని విడుదల చేసే సాహసం చేస్తారా? అన్న సందేహం కొలీవుడ్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అలాంటి సందేహాలు నివృత్తి కావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement