ఆంతర్యమేమిటో..
సూపర్‌స్టార్‌తో పొన్‌రాజ్
మరి కొందరితో భేటీకి కసరత్తు
సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, భారతరత్నం, దివంగత అబ్దుల్ కలాం వెన్నంటి ఉండి, ఆయన పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఉన్న పొన్‌రాజ్ కొత్త మంతనాలు చర్చకు తెర లేపాయి. తాజాగా, దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మంతనాలు సాగించి, మరి కొందరు వీఐపీలతో భేటీ కసరత్తుల్లో పొన్‌రాజ్ ఉండడంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో సర్వత్రా పడ్డారు. భారత రత్నం, దివంగత అబ్దుల్ కలాం కు సలహాదారుడిగా పొన్‌రాజ్ వ్యవహరించిన విష యం తెలిసిందే. కలాం మరణానంతరం ఆయన ఆ శయ సాధన లక్ష్యంగా తన ప యనాన్ని కొనసాగించే పని లో పడ్డారు.
ఇందులో భాగం గా అసెంబ్లీ ఎన్నికల సమయం లో పొన్‌రాజ్ కొత్త పార్టీని ప్రకటించారు. మేధావులు, యువత, నిపుణులు, వీఐపీలతో కూడిన ఆ పార్టీకి అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ పార్టీని బలోపేతం చేయడానికి తగ్గ కసరత్తుల్ని పొన్‌రాజ్ వేగవంతం చేశారు. యువతలో చైతన్యం తీసుకొచ్చే విధంగా, అన్ని రంగాల్లోని ప్రముఖుల్ని ఈ వేదిక మీదకు తెచ్చే దిశగా తన కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలపై ఆసక్తిని ప్రదర్శించే ప్రముఖుల్ని ఎంపిక చేసుకుని వారిని కలాం ఆశయ సాధన దిశగా నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.
ఇందుకు అద్దం పట్టే రీతిలో వీఐపీలతో మంతనాలకు సిద్ధమయ్యారు. ఆ దిశగా రాజకీయాల్లోకి దేవుడు ఆదేశిస్తే...అంటూ దాటవేత దోరణితో ముందుకు సాగుతున్న దక్షిణభారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పొన్‌రాజ్ భేటీ సమాచారం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో రజనీకాంత్‌తో భేటీలో రాజకీయ అంశాలపై చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడడంతో అంతర్యాన్ని వెతికే పనిలో సర్వత్రా పడ్డారు. పొన్ రాజ్‌తో భేటీ సమయంలో దేవుడు ఆదేశిస్తే..అన్న పాత పాటనే సూపర్ స్టార్ పాడినట్టు సమాచారం. రజనీకాంత్‌తో భేటీ తదుపరి, మరి కొందరు సీనీ వీఐపీలతో భేటీకి తగ్గ కసరత్తులతో పొన్‌రాజ్ ముందుకు సాగుతుండడం ఆలోచించ దగ్గ విషయమే.