
గ్యాంగ్‌స్టర్‌గా సూపర్‌స్టార్?
సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా అవతారమెత్తనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌హాట్ న్యూస్ ఇదే.
సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా అవతారమెత్తనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌హాట్ న్యూస్ ఇదే. కారణం లేకపోలేదు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం విడుదలై అర్ధ ఏడాది అయిపోయింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో రజనీకి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నుంచి చాలా తలనొప్పిలు తెచ్చిపెట్టింది. ఆ సమస్య ఇంకా ఒక కొలిక్కి రాలేదన్నది వేరే విషయం. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ తన తాజా చిత్రానికి రెడీ అయ్యారు.
ఈ చిత్రంపై రకరకాల ప్రచారం జరిగింది. చివరికి అట్టకత్తి, మెడ్రాస్ చిత్రాల దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ హీరోగా వి.క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నట్లు ఆ సంస్థ అధికారిక పూర్వంగా ప్రకటించడంతో రజనీకాంత్ తాజా చిత్రం పై గందరగోళానికి తెరపడింది. ఈ చిత్రం ఆగస్టులో మలేషియాలో ప్రారంభం కానుందని వెల్లడించారు. కాగా ఈ చిత్రం టైటిల్ ఏమిటి? కథ ఎలా ఉంటుందన్నది చిత్ర ప్రముఖుల ఆలోచనలకు, ప్రేక్షకుల ఊహలకు వదిలేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ తాజా చిత్రం పేరు గ్యాంగ్‌స్టర్ అని ఇందులో ఆయన భాషా చిత్రంలోని పాత్ర తరహాలో మాఫియా లీడర్‌గా నటించనున్నారని పోస్టర్స్ లాంటి ఫొటోలతో ప్రచారం వెబ్‌సైట్స్‌లో హల్‌చల్ చేస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది చిత్ర వర్గాలు స్పందించే వరకు ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఈ తాజా పోస్టర్లను చూస్తుంటే రజనీకాంత్‌ను 90 ప్రాంతాల్లో చూసినట్లు చాలా ఫ్రెంచ్‌కట్ గెడ్డం, మీసాలతో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు.