రాణి అవతారమెత్తిన ధన్సిక | Kabali Actress Sai Dhansika's New Movie Titled As Rani | Sakshi
Sakshi News home page

రాణి అవతారమెత్తిన ధన్సిక

Published Thu, Jun 23 2016 1:45 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

రాణి అవతారమెత్తిన ధన్సిక - Sakshi

రాణి అవతారమెత్తిన ధన్సిక

నటి ధన్సిక ఇంతకు ముందు పలు చిత్రాల్లో నటించినా కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించిన తరువాత ఆమె రేంజే వేరు అన్నంతగా మారిపోయారు. ఆ చిత్రంలో రజనీకాంత్ కూతురిగా చాలా ప్రాముఖ్యత గల పాత్రను పోషించినట్లు సమాచారం.
 
  కబాలి చిత్రాన్ని పూర్తి చేసి ధన్సిక తాజాగా రాణి అవతారమెత్తారు. అవును తను కథానాయకిగా నటిస్తున్న నూతన చిత్రానికి రాణి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఎస్‌ఎస్.ఫిలింస్ పతాకంపై సి.ముత్తుక్రిష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు ఎస్.బాణి దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన దర్శకుడు సముద్రకని వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. ఇళయరాజా సంగీతాన్ని, ఏ.కుమరన్ చాయాగ్రహణం అందిస్తున్నారు.
 
 ఈ చిత్రం బుధవారం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంగీత దర్శకుడు ఇళయరాజా హాజరై పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నాయకి ధన్సిక పాల్గొన్నారు. చిత్రం అధిక భాగం మలేషియాలో చిత్రీకరణ జరుపుకోనుందట. దీంతో చిత్ర యూనిట్ మలేషియాకు బయలు దేరనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement