రజనీ అభినందనలతో అమ్రేశ్ ఫిదా
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందలు పొందే అవకాశం వస్తే ఎవరైనా ఫిదా అవుతారు.అలాంటిది సంగీత రంగంలో ఎదుగుతున్న వర్ధమాన సంగీతదర్శకుడు,నటుడు అమ్రేశ్‌కు అలాంటి అనుభవం ఎదురైతే ఆ సంతోషానికి అవదులుంటాయా‘సినీవినీలాకాశంలో నటిగా,దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్న సీనియర్ నటి జయచిత్ర వారసుడే ఈ అమ్రేశ్.పులి కడుపున పులిబిడ్డే పుడుతుందంటారు.అది అమ్రేశ్ విషయంలోనూ రుజువైయ్యింది.ఈయన బాల్యదశలోనే నటుడిగా పుదియరాగం అనే చిత్రం ద్వారా బాల నటుడిగా రంగప్రవేశం చేశారు.ఆ తరువాత నానే ఇన్నుళ్ ఇల్‌లై చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు.ఆ చిత్రాన్ని అమ్రేశ్ తల్లి,నటి జయచిత్ర స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
ఆ చిత్రంలో అమ్రేశ్ హావభావాలు,అభినయం విమర్శకులను సైతం మెప్పించింది.ఆయన సంభాషణల ఉచ్చరణలో పరిపక్వత సినీ వర్గాలను ఆశ్యర్య పరచింది.నానే ఇన్నుళ్ ఇల్‌లై చిత్రం తరవాత అమ్రేశ్‌కు బయట చిత్రాల అవకాశాలు వచ్చినా చిన్నతనం నుంచి సంగీతంపై ఆసక్తి ఉండటంతో ఆ రంగంపై దృష్టిసారించారు.అలా ఆయన సంగీతం అందించిన తొలి బయటి నిర్మాతల చిత్రం మొట్టశివ కెట్టశివ.ప్రఖ్యాత నిర్మాత ఆర్‌బీ.చౌదరి సమర్పణలో వేందర్ మూవీస్ మదన్ నిర్మించిన ఇందులో ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్ కథానాయకుడిగా నటించారు.ఇందులో పాటలన్నీ మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫాస్ట్ బీట్స్‌తో అమ్రేశ్ కట్టిన భాణీలకు ధియేటర్లు దద్దరిల్లుతున్నాయి.నిర్మాత ఆర్‌బీ.చౌదరిని సంతృప్తి పరచడం అంత సులభం కాదు.అలాంటిది ఆయనతో పాటు చిత్ర కథానాయకుడు లారెన్స్‌ను తన సం గీతంలో అమ్రేశ్ మెప్పించారు.
చాలా మంచి పాటలను తమ చిత్రానికి అందించారని నటుడు లారెన్స్ విలేకరుల సమావేశంలో అమ్రేశ్‌ను అభినందించారు.కాగా ఇటీవల మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకా కోసం పత్యేకంగా చిత్ర వర్గాలు ప్రదర్శించారు.చిత్రం చూసిన రజనీకాంత్ అమ్రేశ్ సమకూర్చిన భాణీలు చాలా బాగున్నాయంటూ ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా ప్రశంసించారు.రజనీకాంత్ ప్రశంసలు తన జీవితంలో మరువలేనంటున్న అమ్రేశ్ తాజాగా మరో ప్రఖ్యాత నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న యంగ్ మంగ్ జంగ్ చిత్రానికి సం గీతాన్ని అందించే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు.ఇలా ఇద్దరు ప్రముఖ నృత్యదర్శకులు కథానాయకులుగా నటించిన చిత్రాలకు వరుసగా సంగీతాన్ని అందించడం వివేషమే అవుతుంది.