Jayachitra
-
నేను మళ్లీ నటించడానికి కారణం అతనే..
-
‘అలా జరిగి ఉంటే.. బాహుబలిలో రాజమాత పాత్ర నేను చేసేదాన్ని’
చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ జయచిత్ర మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో మెరిశారు. 70, 80లలో గ్లామరస్ హీరోయిన్గా తెలుగు తెరపై అలరించిన వారిలో ఆమె ఒకరు. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్గా నటించి మెప్పించారు ఆమె. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జయచిత్ర అత్త, తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె తాజాగా పొన్నియన్ సెల్వన్‌లో ఓ ప్రధాన పాత్రలో కనిపంచారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జయచిత్ర తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. చదవండి: హీరోతో లిప్‌లాక్ సీన్.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా స్టార్ హీరోలకు అత్త పాత్రలు వంటి పవర్ఫుల్ రోల్స్ చేసిన తనకు ఇప్పటికి ఓ అసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ సీరియల్లో నటించే అవకాశం కొల్పోయానంటూ జయచిత్ర వాపోయారు. ‘నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. కానీ ఓ సీరియల్లో అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఆ సీరియల్ పేరు ‘మంగమ్మగారి మనవరాలు’. దర్శకుడు రాఘవేంద్రరావుగారి ఫ్యామిలీకి చెందినవారే ఆ సీరియల్ చేశారు. ఆ సీరియల్‌కి సంబంధించిన విషయాలను మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అదే సమయంలో నేను ఫోన్లో అదే సీరియల్ కథను వింటున్నాను’ అని చెప్పారు. చదవండి: ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆందోళన ‘‘అయితే వచ్చిన వారిలో ఒకరు నా గురించి ఆసత్య ప్రచారం చేసి ఆ సీరియల్ అవకాశం పోయేలా చేశారు. నేను ఫోన్లో ఆ సీరియల్ కథ వింటుండగానే వచ్చిన వారిలో ఓ వ్యక్తి ‘నేను సీరియల్ చేయనన్నాననీ, ఫారిన్ వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నానని’ అవతలివారికి చెప్పేశారు. రాజమౌళి గారి గెస్టు హౌస్‌లో ఉంటూ ఆ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ, రాఘవేంద్రగారికి లేనిపోనివి చెప్పారు. అలా ఆ ప్రాజెక్టులో నేను లేకుండా పోయాను. ఒకవేళ ఆ సీరియలక్లో నేను నటించి ఉంటే ‘బాహుబలి’ సినిమాలో రాజమాత పాత్ర నాకు దక్కి ఉండేదేమో. ఇన్ని సినిమాలు చేసిన నాకు ఒక సీరియల్ ఇలా మిస్సయిందే అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. -
తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి కనిపించే దైవం వంటిదని సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు జయచిత్ర అన్నారు. కన్నతల్లిని మించిన దైవం ఈలోకంలో మరొకటి లేదన్నారు. ఈనెల 9వ తేదీన మాతృదినోత్సవం సందర్భంగా ఆమె శనివారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఎదిగినా, అనేక విజయాలు సాధించినా అంతగా తీర్చిదిద్దిన కన్నతల్లిని ఎప్పుడూ మరువరాదన్నారు. బిడ్డలు ప్రయోజకులు కావడం తల్లిదండ్రులకు ఆనందం అన్నారు. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులను కాపాడుకోవాలని, పదహారేళ్ల ప్రాయంలో సినీ జీవితంలోకి అడుగుపెట్టి పరిశ్రమలో గుర్తింపు, గౌరవం, హోదా దక్కించుకున్నానంటే తన తల్లి జయశ్రీ ఆశీస్సులే ప్రధాన కారణమని తెలిపారు. తన కృషికి తల్లిదీవెన తోడు కావడంతో సినీ పరిశ్రమలో రాణించగలిగానని చెప్పారు. అలాగే తన కుమారుడు అమ్రీష్‌కు తన దీవెనలు రక్షగా నిలిచాన్నారు. సినీసంగీత దర్శకుడిగా ఎదిగి పేరు ప్రతిష్టలు గడించాడని, తన కుమారుడు సైతం ఇటీవల కొన్ని సంఘటనల నుంచి బయటపడ్డాడని, ఈ మాతృదినోత్సవాన్ని కలిసి జరుపుకోవడం తల్లిగా తన అదృష్టమని జయచిత్ర చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీలోకి నయనతార కొత్త సినిమా.. మే 9 నుంచి స్ట్రీమింగ్ -
నటి జయచిత్రకు భర్త వియోగం
సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేశ్ (62) శుక్రవారం ఉదయం తిరుచ్చిలో గుండెపోటుతో కన్నుమూశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి జయచిత్ర తెలుగునాట జన్మించినా తమిళనాడులో నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 200 పైగా చిత్రాల్లో కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన జయచిత్ర 1970–80 ప్రాంతంలో అగ్రకథానాయికగా వెలుగొందారు. కథానాయికగా రాణిస్తున్న సమయంలోనే జయచిత్రకు కుంభకోణంకు చెందిన గణేశ్‌తో 1983లో వివాహం జరిగింది. గణేశ్ నటుడిగా ఓ చిత్రంలో నటించారు. ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్రేష్. గణేశ్ శుక్రవారం ఉదయం తిరుచ్చిలో కన్నుమూయగా ఆయన భౌతికకాయాన్ని చెన్నై, పోయెస్ గార్డెన్‌లోని స్వగృహానికి తరలించారు. గణేశ్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గణేశ్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. -
వేధించాడు.. చేతబడి చేశాడు: నటి జయచిత్ర
తెలుగుతోపాటు సౌత్‌లోని పలు భాషల్లో నటించిన సీనియర్ నటి జయచిత్ర న్యాయపోరాటంలో విజయం సాధించారు. తన ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తి.. అద్దె చెల్లించకపోగా.. వేధింపులకు గురి చేస్తాడంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో తీర్పు ఆమెకు అనుకూలంగా రావటంతో మీడియా ముందుకు వచ్చారు. సాక్షి, చెన్నై: ‘కోడంబాక్కం, రంగరాజపురంలోని భాస్కర్ వీధిలో జయచిత్రకు ఓ ఇల్లు ఆమెకు ఉంది. తన దగ్గర పని చేసే కారు డ్రైవర్ ఇళం మురుగన్, మీనా దంపతులకు ఆమె ఆ ఇంటికి అద్దెకు ఇచ్చారు. అయితే 12 ఏళ్లుగా వాళ్లు అద్దె చెల్లించకుండా అందులో జీవిస్తున్నారు. నమ్మకస్తుడు కావటంతో ఆమె కూడా ఇబ్బంది పెట్టలేదు. అయితే అద్దె చెల్లిస్తున్నట్లు నకిలీ పేపర్లు సృష్టించి ఆ ఇంటిని ఆక్రమించుకోవాలని ఇళం కుట్ర పన్నాడు. ఈ క్రమంలో తనపై చేతబడి కూడా చేశాడని జయచిత్ర ఆరోపించారు. నమ్మకంగా ఉన్న వ్యక్తి మోసం చేయటంతో మనస్తాపానికి గురయిన ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎట్టకేలకు కొంత సొమ్మును రాబట్టగలిగినట్లు ఆమె పేర్కొన్నారు. బాకీ సొమ్ముతోపాటు ఇళమ్ మురుగన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కాగా ఈ నెల 20వ తేదీలోగా ఇల్లు ఖాళీ చేయాలని కోర్టు ఇళమ్ మురుగన్‌కు గడువు ఇచ్చిందని, ఆలోగా ఇల్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సాయంతో తాళం బద్ధలు కొట్టి ఇంటిని స్వాధీనం చేసుకుంటానని జయచిత్ర వెల్లడించారు. కాగా ఇళంమురుగన్‌కి నేరచరిత్ర చాలానే ఉంది. ఇంతకు ముందు అశోక్ లోధా అనే ఫైనాన్సియర్ మోసం చేయటంతో కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత మరో నటుడ్ని కూడా మోసం చేయటంతో.. మరోసారి జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం ఇళం మురుగన్ జైల్లోనే ఉన్నట్లు నటి జయచిత్ర పేర్కొన్నారు. -
అంతా దైవ చిత్రం
నేను నా దైవం జరిగేదంతా మన మంచికే... అనే భావం ఎక్కడ నుంచి పుట్టి ఉంటుంది? దేవుడికి ప్రేమించడం తప్ప, ద్వేషించడం రాదనే నిజం నుంచి పుట్టింది. మనం అనుకున్నదేదో కాలేదని దేవుణ్ని నిందించవచ్చు! కానీ... దేవుడు నవ్వి... అంతా నీ మంచికే... అని ఆశీర్వదిస్తాడు!! చివరికి... మనం అనుకున్నది అనుకున్నట్లే జరక్కపోవడమూ మంచికే అని... మనకు ఆలస్యంగానైనా తెలుస్తుంది. జయచిత్ర జీవితంలో ఇలాంటివి ఎన్నో! ఆమె జీవితమే ఒక చిత్రం! అంతా దైవచిత్తం అని అర్థం చేసుకున్న జయచిత్రమిది!! తల్లిని మించిన దైవం లేదని అంటారు. దేవుడు ప్రతిచోట ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. సినీ నటి జయచిత్ర కూడా ఒక అమ్మే. ఆమె కుమారునికి జయచిత్ర దైవమైతే, ఆమెకు ఆమె తల్లి అమ్మాజీ దైవం. వీరందరూ కలిసి ఆరాధించే దేవుళ్లూ ఉన్నారు. అయితే ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూడగలగాలి, అదే అసలైన దైవారాధన అంటున్నారు జయచిత్ర. దైవం అనే మాటకు మీ నిర్వచనం ఏమిటి? మొత్తం ప్రపంచమే ఈ దేవుని సృష్టి. మన కంటికి కనపడని ఒక మహాశక్తి. మన ఊపిరి, ప్రాణం, ఆత్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో. దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఒక చిన్న విషయం కూడా జరుగదు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు మీ ఇంటి ప్రాంగణంలో గుడి ఎందుకు కట్టించుకున్నారు?! అపుడు నేను సుమారు పదహారూ పదిహేడేళ్ల అమ్మాయిని. సోగ్గాడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలు చేస్తున్నపుడు చెన్నై మహాలింగపురంలో మావాళ్లు ఇల్లు కడుతున్నారు. ఇంటి స్థలం ఒకవైపు కార్నర్‌గా ఉంది, దోష నివారణకు గుడి కడితే బాగుంటుందని అమ్మ సూచించారు. మహాబలిపురం నుండి మూడు అడుగుల వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించాం. మొదట మా కోసమని ఇంటి ప్రాంగణంలోపల ‘శ్రీ జయ వినాయగర్ ఆలయం’ పేరుతో నిర్మించాం. అ తరువాత అందరికీ అందుబాటులో ఉండేలా మార్పులు చేశాం. చిన్నప్పటి నుంచే మీలో భక్తి భావం ఉండేదా? మా అమ్మమ్మ, అమ్మ అమ్మాజీ గారు చాలా భక్తిపరులు. అమ్మవారు, శివుడు, అయ్యప్ప ఆలయాలకు నన్ను వెంటపెట్టుకుని వెళ్లేవారు. నాకు తోడుగా షూటింగులకు వచ్చినపుడు కూడా మడిగట్టుకుని పూజలు చేసేవారు. మీకు ఏ దేవుడంటే ఎక్కువ ఇష్టం? వినాయకుడు, వేంకటేశ్వరస్వామి అంటే మహా ఇష్టం. శ్రీ వేంకటేశ్వరుడు అంటే మన మధ్య జీవించి ఉండే దేవుడు. అత్తగారింటి వారు తిరుచ్చిరాపల్లిలోని శిరువాదియూరు అమ్మన్‌ను కొలుస్తారు. ప్రతి ఏడాది మే 19వ తేదీన మా కుటుంబం తిరుమల కొండపై దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వెళుతున్నాం. అంతా దైవానుగ్రహం. మీకంత దైవానుగ్రహం ఎలా కలిగిందని అనుకుంటున్నారు? మీకో విషయం చెప్పేదా. నేనే కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా పూర్వజన్మ సుకృతులం. ఎందుకంటే.. నేను కృష్ణ జయంతి రోజున పుట్టాను. మావారు శివరాత్రి రోజున జన్మించారు. మా బాబుది అనూరాధ నక్షత్రం. షిరిడీ సాయిబాబా సమాధి అయిన రోజుటి నక్షత్రం అది. అంతేకాదు కంచిపీఠం చంద్రశేఖర సరస్వతి మహా స్వాముల వారు కూడా అనూరాధ నక్షత్రంలో ఈ లోకంలో అవతరించారు. అది తలుచుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. అంతా బాగుంటే దైవానుగ్రహం అనుకుంటాం. ఏదైనా కీడు, నష్టం జరిగితే దేవుyì ని కోప్పడతాం. ఈ మానవ స్వభావంపై మీరేం చెబుతారు? కష్టనష్టాల మిళితమే జీవితం. ప్రతి ఒక్కటీ దైవసంకల్పమేనని భావించాలి. దేవుడిపై కోప్పడటం, అలగటం నా జీవితంలో ఎప్పుడూ లేదు. దేవుడా నేనేమైనా తప్పు చేశానా, క్షమించమని ప్రాధేయపడటమే. మనం అనుకున్నది జరగనపుడు ఎందుకిలా జరిగిందని అనుకోవడం సహజం. అంతమాత్రాన దేవుడిపై నిందలు వేయడం తగదు. మరోరకంగా మంచి జరుగుతుందని భావిస్తూ సమస్యలను సైతం సానుకూల దృక్పథంతో స్వీకరించడమే మన పని. కష్టాలు కలిగినపుడు కూడా ‘శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు’ అని సరిపెట్టుకుంటారా? అదే చెప్తున్నా.. జీవితంలో ప్రతికదలికకు భగవంతుడే కారణం అనే నమ్మకాన్ని పెంచుకుంటే కష్టనష్టాలను తట్టుకునే శక్తిని భగవంతుడే ఇస్తాడు. గత ఏడాది అక్టోబరులో కేవలం నేనొక్కదాన్నే అన్నింటికీ నిలబడి బాబు పెళ్లి చేసానంటే దేవుడిచ్చిన శక్తి కాక మరేమిటి. అంతేకాదు ఏదో శక్తి నన్ను నడిపించింది. మనుమడి పెళ్లిని (నా కుమారుడు) కనులారా చూసిన ఆనందంతో ‘నా కోడలు గ్రేట్’ అంటూ నన్ను మెచ్చుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసారు. నిష్టాగరిష్ట సంప్రదాయ కుటుంబంలో అత్తగారి 16 రోజుల కర్మక్రతువుల సేవలు కూడా ఏకైక కోడలిగా నెరవేర్చే శక్తిని కూడా నాకు ఆ దేవుడే ప్రసాదించాడు. ‘ఇది దైవ మహిమ’ అని అనుకున్న సందర్భాలు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా? ఓ..తప్పకుండా. మా అమ్మ, అమ్మమ్మ అందరం కలిసి చెన్నైకి సమీపంలోని అంగాళపరమేశ్వరీ అమ్మవారి ఆలయానికి వెళ్లేవారం. అక్కడ పెద్ద పాము పుట్ట ఉండేది. వెళ్లినపుడల్లా కోడిగుడ్డు వేసి పాలు పోసేదాన్ని. ఆ రకంగా పాము అంటే భయం కంటే భక్తి ప్రపత్తులు ఉండేవి. సరిగ్గా అదే సమయంలో ‘వెళ్లికిళమై వ్రతం’ (తెలుగులో నోము) చిత్రంలో హీరోయిన్గా బుక్ అయ్యాను. అపుడు నా వయస్సు 18 ఏళ్ల లోపే. అంత చిన్న వయస్సులో ఎంతో పొడవైన నిజమైన నాగుపాముతో ఏ మాత్రం భయం లేకుండా నటించానంటే అమ్మవారి కరుణే కారణం. అంతేకాదు, నాకు ఇంత మంచి జీవితం దక్కడం కూడా దైవ మహిమే అనుకుంటాను. ఇంతగా మిమ్మల్ని అనుగ్రహించిన ఆ దేవుడికి రుణపడి ఉన్నానన్న భావన మీలో కలిగిన సందర్భాలున్నాయా? దేవుడి రుణం తీర్చుకోవడం మానవ మాత్రునికి సాధ్యమా చెప్పండి? అయితే ఒక విషయం మాత్రం గుర్తుకు వస్తోంది. ఒకసారి చెన్నై టీనగర్‌లోని టీటీడీ ఆలయానికి వెళ్లినపుడు బైట గేటు మూసి ఉంది. ఇదేమిటి ఈ సమయంలో మూసి ఉన్నారని ఆలయ నిర్వాహకులను అడిగాను. శ్రీవారికి నైవేద్యం పెడుతున్నప్పుడు మూసివేస్తామని చెప్పారు. ఈ సంగతి భక్తులకు ఎలా తెలుస్తుంది? పైగా ఏమేమో అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కదాని బాధపడ్డాను. నైవేద్యం సమయంలో గంట కొడుతూ ఉంటే భక్తులకు ఆ సంగతి అర్థం అవుతుందని, ఆ గంటను నేనే కొనిస్తానని నిర్వాహకులను కోరాను. వాళ్లు అంగీకరించారు. వెంటనే చెన్నైలోని ప్యారిస్ సెంటర్ వెళ్లాను. బురద కారణంగా కారు లోనికి వెళ్లే పరిస్థితి లేదు. అక్కడే ఒక సందులోకి దిగి వెళ్లి, ఓ షాపులో గంటను సెలక్ట్ చేశాను. ‘నేను మెయిన్ రోడ్డులోకి వెళ్లిన తరవాత గంట కొట్టు, గంట మోత నాకు అక్కడికి వినిపించాలి’ అని షాపు వాళ్లకు చెప్పి మళ్లీ ఆ బురదలో వెనక్కు నడుచుకుంటూ వచ్చి విన్నాను. నేటికీ ఆలయంలో స్వామివారికి నేను సమర్పించిన ఆ గంటను నైవేద్యం సమయంలో వినిపిస్తున్నారు. అయితే అది రుణం తీర్చుకోవడం కాదు. ఏమి చేసినా దేవుని రుణం తీరేది కాదు. దైవం మానుష రూపేణా అంటారు.. మరి మనుషులకు సేవ చేస్తే సరిపోతుంది కదా, ఈ పూజలు, అభిషేకాలు ఎందుకు? ప్రతిఒక్కరిలో దైవాన్ని చూడగల పరిణతి మనుషుల్లో పెరిగినపుడు మనం ఇతరులకు చేసే సేవలు ఆ దేవదేవుని పాదాల వద్దకు చేరుతాయి. దేవుడు ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటారు? జన్మజన్మలకు అమ్రేష్ వంటి కొడుకు పుట్టాలి. బాబు అంటే నాకు ప్రాణం. అతనిని చల్లగా చూడు తండ్రీ అని ప్రార్థిస్తాను. బిడ్డల్ని సంతృప్తిగా చూసుకునేందుకే ప్రతి తల్లి ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడుతుంది. అలాంటి ఆశే ప్రతి తల్లినీ బతికిస్తూ ఉంటుంది. మా బాబు తన సంగీత దర్శకత్వంలో తొలిసారిగా ‘జీవితం’ అనే ఆడియో నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేశాడు. అందులోని ‘ఏడు కొండల వెంకయ్యే ఈ లోకము’ అనే గీతాన్ని తెలుగు, తమిళంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. ఈ పాట తిరుమల కొండపై వినపడాలని తల్లిగా నేను చేసిన ప్రార్థనను స్వామి ఆలకించాడు. తిరుమల కొండల్లో బాబు ఆడియో వినిపించినపుడు పులకించిపోయాను. సంగీతం సరే తమిళంలో పాటలు కూడా రాస్తున్నాడు. తెలుగు చదవకున్నా తెలుగు పాటలు రాస్తున్నాడు. నా బాబుకు నేను బహూకరించిన నిలువెత్తు మురుగన్ త్రిశూలం ఒక కవచంలా కాపాడుతోంది. ప్రత్యక్షం కాకుండానే మాకు ఎన్నో వరాలు ఇచ్చిన ఆ దేవుడిని ఇంకేమి కోరుకునేది. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి చెన్నై -
రజనీ అభినందనలతో అమ్రేశ్ ఫిదా
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందలు పొందే అవకాశం వస్తే ఎవరైనా ఫిదా అవుతారు.అలాంటిది సంగీత రంగంలో ఎదుగుతున్న వర్ధమాన సంగీతదర్శకుడు,నటుడు అమ్రేశ్కు అలాంటి అనుభవం ఎదురైతే ఆ సంతోషానికి అవదులుంటాయా‘సినీవినీలాకాశంలో నటిగా,దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్న సీనియర్ నటి జయచిత్ర వారసుడే ఈ అమ్రేశ్.పులి కడుపున పులిబిడ్డే పుడుతుందంటారు.అది అమ్రేశ్ విషయంలోనూ రుజువైయ్యింది.ఈయన బాల్యదశలోనే నటుడిగా పుదియరాగం అనే చిత్రం ద్వారా బాల నటుడిగా రంగప్రవేశం చేశారు.ఆ తరువాత నానే ఇన్నుళ్ ఇల్లై చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు.ఆ చిత్రాన్ని అమ్రేశ్ తల్లి,నటి జయచిత్ర స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రంలో అమ్రేశ్ హావభావాలు,అభినయం విమర్శకులను సైతం మెప్పించింది.ఆయన సంభాషణల ఉచ్చరణలో పరిపక్వత సినీ వర్గాలను ఆశ్యర్య పరచింది.నానే ఇన్నుళ్ ఇల్లై చిత్రం తరవాత అమ్రేశ్కు బయట చిత్రాల అవకాశాలు వచ్చినా చిన్నతనం నుంచి సంగీతంపై ఆసక్తి ఉండటంతో ఆ రంగంపై దృష్టిసారించారు.అలా ఆయన సంగీతం అందించిన తొలి బయటి నిర్మాతల చిత్రం మొట్టశివ కెట్టశివ.ప్రఖ్యాత నిర్మాత ఆర్బీ.చౌదరి సమర్పణలో వేందర్ మూవీస్ మదన్ నిర్మించిన ఇందులో ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్ కథానాయకుడిగా నటించారు.ఇందులో పాటలన్నీ మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫాస్ట్ బీట్స్‌తో అమ్రేశ్ కట్టిన భాణీలకు ధియేటర్లు దద్దరిల్లుతున్నాయి.నిర్మాత ఆర్బీ.చౌదరిని సంతృప్తి పరచడం అంత సులభం కాదు.అలాంటిది ఆయనతో పాటు చిత్ర కథానాయకుడు లారెన్స్‌ను తన సం గీతంలో అమ్రేశ్ మెప్పించారు. చాలా మంచి పాటలను తమ చిత్రానికి అందించారని నటుడు లారెన్స్ విలేకరుల సమావేశంలో అమ్రేశ్‌ను అభినందించారు.కాగా ఇటీవల మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకా కోసం పత్యేకంగా చిత్ర వర్గాలు ప్రదర్శించారు.చిత్రం చూసిన రజనీకాంత్ అమ్రేశ్ సమకూర్చిన భాణీలు చాలా బాగున్నాయంటూ ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా ప్రశంసించారు.రజనీకాంత్ ప్రశంసలు తన జీవితంలో మరువలేనంటున్న అమ్రేశ్ తాజాగా మరో ప్రఖ్యాత నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న యంగ్ మంగ్ జంగ్ చిత్రానికి సం గీతాన్ని అందించే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు.ఇలా ఇద్దరు ప్రముఖ నృత్యదర్శకులు కథానాయకులుగా నటించిన చిత్రాలకు వరుసగా సంగీతాన్ని అందించడం వివేషమే అవుతుంది. -
సినీనటి ఇంట్లో చోరీ
25 కిలోల వెండి వస్తువుల అపహరణ చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నై నుంగంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహలింగపురంలోని జయచిత్ర ఇంటిప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు. విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు. ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలో భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించకుండా పోయాయని ఈనెల 24వ తేదీన గుర్తించారు. సిబ్బందిని, పూజారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రముఖ సినీనటి ఇంట్లో చోరీ
చెన్నై: ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నై నుంగంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహలింగపురంలోని జయచిత్ర ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు. విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు. ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలోపల భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల రూపాయల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించడంలేదు. ఈ విషయాన్ని ఈనెల 24వ తేదీన గుర్తించారు. సిబ్బందిని, పూజారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.