
సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేశ్ (62) శుక్రవారం ఉదయం తిరుచ్చిలో గుండెపోటుతో కన్నుమూశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి జయచిత్ర తెలుగునాట జన్మించినా తమిళనాడులో నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 200 పైగా చిత్రాల్లో కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన జయచిత్ర 1970–80 ప్రాంతంలో అగ్రకథానాయికగా వెలుగొందారు. కథానాయికగా రాణిస్తున్న సమయంలోనే జయచిత్రకు కుంభకోణంకు చెందిన గణేశ్‌తో 1983లో వివాహం జరిగింది. గణేశ్ నటుడిగా ఓ చిత్రంలో నటించారు. ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్రేష్. గణేశ్ శుక్రవారం ఉదయం తిరుచ్చిలో కన్నుమూయగా ఆయన భౌతికకాయాన్ని చెన్నై, పోయెస్ గార్డెన్‌లోని స్వగృహానికి తరలించారు. గణేశ్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గణేశ్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment