సినీనటి ఇంట్లో చోరీ | theft in actress house | Sakshi
Sakshi News home page

సినీనటి ఇంట్లో చోరీ

Published Sun, May 3 2015 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

సినీనటి ఇంట్లో చోరీ

సినీనటి ఇంట్లో చోరీ

 25 కిలోల వెండి వస్తువుల అపహరణ
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నై నుంగంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహలింగపురంలోని జయచిత్ర ఇంటిప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు. విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు. ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలో భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించకుండా పోయాయని ఈనెల 24వ తేదీన గుర్తించారు. సిబ్బందిని, పూజారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement