జయచిత్ర
చెన్నై: ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నై నుంగంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహలింగపురంలోని జయచిత్ర ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు. విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు.
ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలోపల భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల రూపాయల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించడంలేదు. ఈ విషయాన్ని ఈనెల 24వ తేదీన గుర్తించారు. సిబ్బందిని, పూజారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.