సూపర్‌స్టార్‌తో విద్యాబాలన్? | Rajinikanth's heroine: Will it be vidya? | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌తో విద్యాబాలన్?

Published Mon, Jun 8 2015 1:59 AM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM

సూపర్‌స్టార్‌తో విద్యాబాలన్? - Sakshi

సూపర్‌స్టార్‌తో విద్యాబాలన్?

 సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు రంజిత్, నిర్మాత కలైపులి ఎస్.థాను. ఇక్కడి వరకు పక్కా. అలాగే షూటింగ్ ఆగస్టులో మలేషియాలో ప్రారంభం కానుంది. ఇక నిర్ణయం కావలసిన విషయాల్లో ముఖ్యమైనది హీరోయిన్ ఎవరన్నది. అసలు ఈ చిత్రంలో రజనీకి హీరోయిన్‌నే ఉండదని ప్రచారం జరిగింది.తాజాగా రజనీకాంత్ చిత్రంలో నటించే హీరోయిన్ల ఎంపిక పట్టికలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నట్లు వారితో మొదటి వరసలో కహాని చిత్ర హీరోయిన్ విద్యాబాలన్ ఉన్నట్లు సమాచారం.
 
 ఈ దర్టీ పిక్చర్ హీరోయిన్‌తో చిత్ర దర్శక, నిర్మాతలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దర్శకుడు కథ కూడా వినిపించినట్లు అయితే ఇప్పుడు బాల్ విద్యాబాలన్ కోర్టులో ఉన్నట్లు తెలిసింది. ఆమె ఓకే అనడమే తరువాయి మిగతా విషయాలు చకచకా జరిగిపోతాయని సమాచారం. విద్యాబాలన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమిళంలో మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.  అందువలన విద్యాబాలన్ రజనీ చిత్రంలో నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే  కోలీవుడ్ టాక్. ఇప్పటికే ఐశ్వర్యారాయ్, దీపిక పదుకునే, సోనాక్షి సిన్హా లాంటి వారు మన సూపర్‌స్టార్‌తో నటించేశారు. ఇక విద్యాబాలన్ నటించడం ఖాయం అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement