సూపర్‌స్టార్‌తో నటించడానికి ఎదురు చూస్తున్నా | Amitabh Bachchan, Dhanush, Amy Jackson wish superstar Rajnikanth on his birthday! | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌తో నటించడానికి ఎదురు చూస్తున్నా

Published Sun, Dec 13 2015 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

సూపర్‌స్టార్‌తో నటించడానికి ఎదురు చూస్తున్నా

సూపర్‌స్టార్‌తో నటించడానికి ఎదురు చూస్తున్నా

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జత కట్టడానికి చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నానని అంటోంది ఇంగ్లీష్ బ్యూటీ ఎమిజాక్సన్. ఈ అమ్మడు నిజంగా లక్కీ నటే అని చెప్పక తప్పదు. ఏదో ఒక చిత్రంలో (మదరాసు పట్టణం) నటించి కనుమరుగవుతుందిలే అని ఊహించుకున్న సినీ వర్గాలను విస్మయ పరిచేలా ఎమిజాక్సన్ తన కెరీర్‌ను కోలీవుడ్‌లో సుస్థిరం చేసుకుంది. ఐ చిత్రంలో అందాలను ఆరబోసి అమితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నాయకిగా ఎదుగుతోంది. ఎమిజాక్సన్ ధనుష్‌తో నటించిన తంగమగన్ చిత్రం అనుభవాలను పత్రికల వారితో పంచుకుంటూ నటుడు ధనుష్‌తో నటించడం తీయని అనుభవం అంది. ఆయన చాలా క్వైట్ పర్సన్ అని పేర్కొంది. తంగమగన్ చిత్రంలో తనది చాలా మంచి పాత్ర అని చెప్పింది.

17, 18 ఏళ్ల టీనేజ్ యువతిగా ఈ చిత్రంలో నటించానని చెప్పింది. సహనటి సమంతతో తనకు వేవ్‌లెంగ్త్ బాగా కుదిరిందని అంది. అలాగే పార్టనర్ షిప్ వర్కౌట్ అయ్యిందని చెప్పింది. గ్లామర్ గురించి ప్రశ్నించగా అదిఇప్పుడు సినిమాలో ఒక భాగం అయిపోయిందని అంది. మల్టీ చిత్రాల ట్రెండ్ పెరుగుతోంది, ఆ తరహా చిత్రాలలో నటిస్తారా? అన్న ప్రశ్నకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

అయితే ఏ చిత్రంలో అయినా తన పాత్ర స్ట్రాంగ్‌గా తాను ఎంజాయ్ చేసేది గాను ఉండాలని అంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎందిరన్-2 చిత్రంలో నటించనుండడం ఎలా ఫీలవుతున్నారన్న ప్రశ్నకు చాలా ఎగ్జైటింగ్‌గా ఆయన సరసన నటించడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక్క చిత్రంలో నటించే అవకాశం రావడమే గొప్పగా భావిస్తారని అలాంటిది రెండో సారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.

ఈ క్రేజీ నటి నటించిన తంగమగన్ ఈ నెల 18న తెరపైకి రానుండగా ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన గెత్తు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఎందిరన్-2కు రెడీ అవుతున్న ఎమి హిందీలో ఒక చిత్రం చేస్తున్నట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement