ఆయన నటనకు పడిపోయా!
ఆయన నటనకు పడిపోయా!
Published Thu, Mar 31 2016 8:37 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
విజయ్ నటనకు ఫ్లాటైపోయానంటోంది ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్. ఈ భామ ఇప్పుడు రెండు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం 2.ఓ కాగా మరొకటి ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న తెరి చిత్రం. 2.ఓ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. కాబట్టి తమిళ ఉగాదికి విడదలకు ముస్తాబవుతున్న తెరి గురించి మాట్లాడుకుందాం అంటోంది నటి ఎమీజాక్సన్.
ఈ చిత్రంలో విజయ్‌కి జంటగా సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంతదే ప్రధాన పాత్ర అట. విజయ్‌కు భార్యగా నటిస్తున్న సమంతకు కూతురుగా నటి మీనా కూతురు నటిస్తోంది.ఇది తల్లీ కూతుర్లు అనుబంధం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని,చిత్ర కథ వీరి చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఎమీ ఇందులో టీచర్‌గా కనిపించనున్నారట.
దీని గురించి ఎమీ తెలుపుతూ తాను నటుడు విజయ్ వీరాభిమానిని ఆయన నటన, డాన్స్ చూసి ఎప్పుడో ఫ్లాటైపోయానని చెప్పింది. ఆయనతో నటించే అవకాశం వస్తే చాలని కోరుకున్నానని, అందుకే తెరి చిత్రంలో రెండో కథానాయకి పాత్ర అయినా నటించడానికి అంగీకరించానని అంది. ఇందులో తాను టీచర్‌గా నటించానని తన పాత్రకు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement