మరోసారి అందాలారబోతలో.. | Amy Jackson goes from glam girl to boss girl at Cannes | Sakshi
Sakshi News home page

మరోసారి అందాలారబోతలో..

Published Fri, Jun 3 2016 4:25 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

మరోసారి  అందాలారబోతలో.. - Sakshi

మరోసారి అందాలారబోతలో..

మరోసారి అందాలారబోతతో అలరించబోతున్నారట నటి ఎమీజాక్సన్. ఈ ఇంగ్లిష్ భామ మదరాసు పట్టణంతో కోలీవుడ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ఆంగ్లేయ యువతిగా నటించినా అందంగా కనిపించిందిగానీ గ్లామర్‌కు పెద్దగా ఆస్కారం లేదు. అదే విధంగా ఆ తరువాత తమిళంతో పాటు హిందీలోనూ ఒక చిత్రం చేసిన ఎమీజాక్సన్ శంకర్ దృష్టిలో పడింది. అంతే రొట్టే విరిగి నేతిలో పడ్డట్టుగా స్టార్‌డమ్‌ను పొందేసింది. ఐ చిత్రంలో విక్రమ్‌కు జంటగా నటించింది.

అందులో మోడల్‌గా నటించడంతో సహజంగానే అందాలను గుమ్మరించింది. శంకర్ ఈ అమ్మడిని చాలా అందంగా తెరపై ఆవిష్కరించారు. అయితే ఆ చిత్రం ఆశించిన టార్గెట్‌ను చేరుకోలేక పోయింది. అయినా శంకర్ తాన తాజా చిత్రం 2.ఓ చిత్రంలో ఎమీజాక్సన్‌నే నాయకిగా ఎంచుకున్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేస్తోంది. ఇందులో తనూ ఒక రోబోగా నటిస్తోందనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎమీ ఖండించింది. తను సూపర్‌స్టార్‌కు ప్రేయసిగా నటిస్తోందట. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలోనూ ఎమీ అందాలను ఆరబోస్తోందట. ఐ చిత్రంలో కంటే 2.ఓ చిత్రంలో ఆ ఇంగ్లిష్ భామను శంకర్ మరింతఅందంగా చూపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎమీ అందాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం 2.ఓ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement