లేటైనా లేటెస్ట్‌గా... | Superstar Rajinikanth opens up on 'Kabali' release | Sakshi
Sakshi News home page

లేటైనా లేటెస్ట్‌గా...

Published Wed, Apr 13 2016 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

లేటైనా లేటెస్ట్‌గా...

లేటైనా లేటెస్ట్‌గా...

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’గా రానున్న సంగతి తెలిసిందే.  రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే నటించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ, విడుదల హడావిడి కనిపించక పోవడంతో వాయిదా పడిందని అందరికీ అర్థమైంది. దాంతో ఎప్పుడు విడుదలవుతుంది? అనే చర్చ మొదలైంది. ఆ విషయం గురించి రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు.

పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాక ఓ టీవీ చానల్ రజనీని ‘కబాలి’ విడుదల గురించి అడిగింది. అప్పుడాయన ‘‘మే నెలాఖరున లేక జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. ‘రెగ్యులర్‌గా మీరు విసిరే పంచ్ డైలాగులు ఇందులోనూ ఉంటాయా?’ అనే ప్రశ్నకు... ‘‘సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని తనదైన శైలిలో నవ్వుతూ సూపర్ స్టార్ అన్నారు. మామూలుగా రజనీ సినిమా అంటే ఆరంభం నుంచీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమాకు కూడా అలానే జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచీ భారీగా అంచనాలు పెంచుకున్నారు రజనీ అభిమానులు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ అభిమాన జనమంతా ఈ నెలలో సినిమా రాదని ఒకింత నిరుత్సాహానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. అయినా... మా నాయకుడు ‘లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా’డు అంటూ, రజనీ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌ని గుర్తు చేస్తూ, సర్ది చెప్పుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement