
సూపర్‌స్టార్ చిత్రానికి కుదిరిన ముహూర్తం
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందాని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందాని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. సూపర్‌స్టార్ నూతన చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఆగస్ట్‌లో ప్రారంభం కానున్నదని అధికారిక వార్త. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్‌థాను భారీ ఎత్తున నిర్మించనున్నారు.ఈ విషయాన్ని చిత్రయూనిట్ వర్గాలు సోమవారం వెల్లడించారు. సుదీర్గ సినీ అనుభవం ఉన్న నిర్మాత థాను. 40 ఏళ్ల క్రితం పంపిణీ రంగంలోకి అడుగు పెట్టిన ఈయన సుబ్రమణియ ఫిలింస్, కలైపులి ఇంటర్నేషనల్ సంస్థల ద్వారా పలు చిత్రాలను పంపిణీ చేశారు.
రజనీకాంత్ హీరోగా నటించిన భైరవి చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసింది కలైపులి ఎస్ థానునే.ఆ చిత్ర విడుదల సమయంలోనే రజనీకాంత్ సూపర్‌స్టార్ పట్టం కట్టి భారీ ఎత్తున ప్రసారం చేసి చిత్ర విజయానికి తోడ్పడ్డారు.అలాంటి థాను 1984లో నిర్మాతగా మారి యార్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ గౌరవ పాత్ర పోషించడం విశేషం.ఆ తరువాత థాను తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పుదుపాడగన్ చిత్రం నుంచి ఆ తరువాత ఆయన నిర్మించి పలు చిత్రాల ప్రారంభోత్సవాలు రజనీకాంత్ చేతుల మీదగానే జరిగాయన్నది గమనార్హం. అదే విధంగా అన్నామలై, ముత్తు, భాషా చిత్రాల సమయంలోనే థాను రజనీకాంత్‌తో చిత్రం చేయాల్సింది. కొన్ని అనివార్యకారణాల వల్ల అది జరగలేదు. అలా 35 గా రజనీతో చిత్రం నిర్మించాలన్న థాను తపం ఇప్పటికి నెరవేరనుందన్నమాట.
ఈ చిత్రానికి అట్టకత్తి, మెడ్రాస్ చిత్రాల ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతాన్ని, మెడ్రాస్ చిత్రం ఫేమ్ జి మురళి చాయాగ్రహణం అందించనున్నారు. చిత్రంలో నటించే హీరోయిన్, ఇతర నటవర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఆగస్ట్‌లో మలేషియాలో ప్రారంభించి 60 రోజుల పాటు అక్కడ నిర్వహించి ఆ తరువాత థాయిల్యాండ్, హాంగ్‌కాంగ్, చెన్నై ప్రాంతాలలో మరో 60రోజుల చిత్రీకరణతో పూర్తి చేయనున్నట్లు చెప్పారు.