రాధిక ఆప్తేకు గోల్డెన్ చాన్స్ | Radhika Apte may bag a role in Rajinikanth's next film | Sakshi
Sakshi News home page

రాధిక ఆప్తేకు గోల్డెన్ చాన్స్

Published Mon, Jul 20 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

రాధిక ఆప్తేకు  గోల్డెన్ చాన్స్

రాధిక ఆప్తేకు గోల్డెన్ చాన్స్

అదృష్టం ఎప్పుడు? ఎలా? వరిస్తుందో ఎవరికి తెలియదు.అలాంటి అదృష్టం ఇప్పుడు నటి రాధిక ఆప్తే తలుపు తట్టింది. ఆమె పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇటీవల అశ్లీల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమై కలకలం సృష్టించిన నటి రాధిక ఆప్తే. అలాగే అర్ధనగ్న దృశ్యాలతో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఈ ఉత్తరాది భామను కోలీవుడ్‌కు పరిచయం చేసిన క్రెడిట్ నటుడు ప్రకాష్‌రాజ్‌కి దక్కుతుంది.
 
 ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించి నాయకుడిగా నటించిన ధోనీ చిత్రంలో రాధిక ఆప్తే కీలక పాత్ర పోషించారు.ఆ తరువాత అళగురాజా, వెట్రిసెల్వన్ తదితర చిత్రాల్లో నటించారు. ఈ బ్యూటీకి టాలీవుడ్ గుర్తించింది. అక్కడ ఏకంగా బిగ్ స్టార్ బాలక్రిష్ణతో లెజెండ్ చిత్రంలో రొమాన్స్ చేశారు. అయితే అక్కడ హీరోల ఆధిక్యం అధికం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అక్కడి వారి ఆగ్రహానికి గురైంది. అలాంటి నటికి కోలీవుడ్‌లో గోల్డెన్‌చాన్స్ దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారర . ఇంతకీ అదేమిటో చెప్పలేదు కదూ’సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో హీరోయిన్ రాధిక ఆప్తేనేనట. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించనున్న విషయం తెలిసిందే.
 
  ఇందులో ఆయన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసమే రజనీ గడ్డం, మీసం పెంచుతున్నారు. కాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం చాలా మంది నటీమణుల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు తెలిసింది. చివరకు దర్శకుడు రంజిత్‌కు నటి రాధిక ఆప్తే సూటబుల్ అనిపించడంతో ఆమెతో సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడు అడిగిన కాల్‌షీట్స్ రెడీగా ఉండడంతో రాధికఆప్తే కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో మలేషియాలో ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement