
రాధికా ఆప్టే.. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె ఇటీవల విజయ్‌సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. కాగా రాధికా ఆప్టే ఇటీవల విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
బంధించారు
ఉదయం 8.30 గంటలకు విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ 10.15 అవుతున్నా విమానం ఇంకా బయలుదేరలేదు. కానీ విమానం బయలుదేరుతోందంటూ సిబ్బంది ప్రయాణికులందరినీ ఏరో బ్రిడ్జ్ ఎక్కించి దానిని మూసివేశారు. ప్రయాణికుల్లో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. అందరినీ గంటకు పైగా ఏరో బ్రిడ్జ్‌లోనే ఉంచారు. అందులో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డాము. సెక్యూరిటీ ఏరో బ్రిడ్జ్ డోర్ కూడా తెరవలేదు.
తాగడానికి నీళ్లు కూడా లేవు
అసలు అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా ఏం జరుగుతుందో తెలియడం లేదు. అలా మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తాగడానికి మంచి నీరు లేదు, వాష్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా వీల్లేదు. ఇదో వింత అనుభవం అని పేర్కొంది రాధికా ఆప్టే. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చదవండి: హారర్ హిట్ 'అరుంధతి'కి 15 ఏళ్లు.. ఆ సంగతి మీకు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment