ఎమీ కల అలా తీరింది! | Salman Khan picks Amy Jackson as the new face of his brand. | Sakshi
Sakshi News home page

ఎమీ కల అలా తీరింది!

Published Mon, Feb 20 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

ఎమీ కల అలా తీరింది!

ఎమీ కల అలా తీరింది!

కోలీవుడ్‌లో లక్కీయెస్ట్‌ హీరోయిన్  ఎవరైనా ఉన్నారంటే అది ఎమీజాక్సనే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కోలీవుడ్‌ ఒడిలో వాలిన నటి ఈ అమ్మడు. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన కెనడా బ్యూటీ ఎమీ అన్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఎమీకీ ఆ తరువాత సరైన సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు మాత్రం వెతుక్కోకుండా వరిస్తున్నాయి. అంతే కాదు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించాలని ఎందరో ఆశ పడుతున్నా, దశాబ్దం కాలం దాటి నటిస్తున్న చెన్నై చిన్నది త్రిష లాంటి నటి ఎన్నాళ్లగానో అలాంటి అవకాశం కోసం చకోర పక్షిలా ఎదరు చూస్తున్నా దక్కనిది ఎమీజాక్సన్  2.ఓ చిత్రంలో అందుకుంది.

ఈ అమ్మడికి బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో రొమాన్స్  చేయాలన్నది చిరకాల కల అట. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ బోల్డ్‌ హీరోయిన్ కు కొన్ని రోజుల క్రితం  వచ్చిన ఒక ఫోన్  కాల్‌ ఆనందంతో తబ్బిబ్బు అయ్యేలా చేసిందట. ఆ ఫోన్ చేసింది నటుడు సల్మాన్ ఖాన్ . తాను నటించనున్న వాణిజ్య ప్రకటనలో మీరు నటించాలని ఆయనే స్వయంగా అడగడంతో ఎమీకీ సంతోషంలో ఏడ్చేసి ఏమి చెప్పాల్లో అర్థం కాలేదట.

కొన్ని ఘడియలు ఊపిరి పీల్చుకుని ఆ తరువాత ఓకే అన్నారట. ఈ విషయాన్ని ఎమీ తన మిత్రులతో చెప్పి సల్మాన్ ఖాన్  అంటే తనకెంత ఇష్టమో ఆయనకు చెప్పి సెల్ఫీ ఫొటో కూడా తీసుకున్నానని తెగ ఆనందపడిపోతోందట. మొత్తం మీద ఎమీజాక్సన్  కల అలా నెరవేరిందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement