రెండులో ఒకటి మాత్రమే! | Rajinikanth 2.0 Movie First Look Poster Releases on November | Sakshi
Sakshi News home page

రెండులో ఒకటి మాత్రమే!

Published Mon, Oct 31 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

రెండులో ఒకటి మాత్రమే!

రెండులో ఒకటి మాత్రమే!

మరమనిషి ప్రేమలో పడితే? అదేనండీ.. రోబో లవ్‌లో పడితే? హీరోయిన్‌తో ఓ డ్యూయెట్ వేసుకుంటే? భలే ఉంటుంది కదూ! ‘ఇనుములో హృదయం మొలిచెలే.. ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే’ అని ‘రోబో’లో సూపర్‌స్టార్ రజనీకాంత్ చిట్టి రోబో రూపంలో ఐశ్వర్యారాయ్‌తో స్టెప్పులేస్తుంటే ఇండియన్ ఆడియన్స్ భలే ఎంజాయ్ చేశారు. ‘రోబో’ మాత్రమే కాదు, దర్శకుడు శంకర్ సినిమాలన్నిటిలోనూ పాటలు ఓ స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడు ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘2.0’లో అబ్బురపరిచే పాటలు చూద్దామని ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పదని సమాచారం.

హీరో హీరోయిన్లు రజనీకాంత్, అమీ జాక్సన్  మధ్య ఒక్క డ్యూయెట్ మాత్రమే ఉంటుందట. ఆల్రెడీ ఉక్రెయిన్‌లోని అందమైన లొకేషన్లలో ఆ డ్యూయెట్‌ను చిత్రీకరించారట. ‘‘ఏ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్‌లో ఐదారు పాటలు ఉంటాయి. కానీ, సినిమాలో ఒక్కటే ఉంటుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మిగతా పాటలను సీడీకి పరిమితం చేస్తారో? ప్రమోషన్ కోసం ఉపయోగిస్తారో?.. శంకర్ మదిలో మరో ఆలోచన ఏమైనా ఉందో? చూడాలి. హిందీ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 20న ముంబైలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement