
ఎవరికి? ఇంకెవరికీ? ఫొటోలో అందంగా కనిపిస్తున్న అమీ జాక్సన్‌కే. ఆమె ఫిల్మీ డ్రీమ్ బాయ్ సల్మానే! అదీ ఇప్పట్నుంచి కాదు... ఎప్పట్నుంచో! ఈ మాట సల్మాన్ చెవిలోనూ వేశారట. బట్, బీటౌన్ బాయ్ ఈ బ్రిటన్ బ్యూటీకి ఇంకా చాన్స్ ఇవ్వలేదు. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు... అమీనే. తప్పకుండా ఏదొక రోజు చాన్స్ వస్తుందనే నమ్మకం ఆమెలో ఉందట. తమిళ్‌లో రజనీకాంత్, విజయ్, హిందీలో అక్షయ్‌కుమార్, తెలుగులో రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించారీ బ్యూటీ! మీకు ఎవరితోనైనా నటించాలనే డ్రీమ్ ఉందా? అని అమీని అడగ్గా.. ‘‘ఇట్స్ ఎ డ్రీమ్ టు వర్క్ విత్ సల్మాన్. నేనెప్పుడు అతణ్ణి కలసినా ఈ మాటే చెబుతుంటా. మేమిద్దరమూ సిన్మా చేసే అంశమై డిస్కషన్స్ జరుగుతాయి.
సల్మాన్ నిర్మించిన సినిమాలో నటించా కానీ, ఆయన సరసన నటించే చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. గతేడాది సల్మాన్ నిర్మించిన హిందీ సినిమా ‘ఫ్రీకీ అలీ’లో అమీ నటించారు. అప్పట్లో వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. ముంబైలో జరిగిన ‘2.0’ ఫస్ట్ లుక్ లాంచ్‌కి సల్మాన్‌ను పిలవకున్నా... అమీ కోసం వచ్చాడనే గుసగుసలు కూడా విన్పించాయి. హిందీలో చాలా మంది హీరోయిన్ల కెరీర్‌కు బూస్టప్ ఇచ్చినట్టు తన సరసన చాన్స్ ఇచ్చి అమీకీ సల్మాన్ బూస్టప్ ఇస్తాడా? వెయిట్ అండ్ సీ!! ఇప్పుడు అమెరికన్ టీవీ సిరీస్ ‘సూపర్‌గాళ్’లో నటిస్తున్నారీమె.
Comments
Please login to add a commentAdd a comment