
రజనీకాంత్ ‘2.0’లో హీరో హీరోయిన్ల మధ్య ఒక్కటంటే ఒక్క పాటే ఉంటుందట. అదీ రోబోటిక్ పాప్ సాంగ్! ఆల్మోస్ట్ ఓ వారం నుంచి ఈ పాట కోసం ఫుల్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు హీరోయిన్ అమీ జాక్సన్. నిన్నటితో ప్రాక్టీస్‌కి ఫుల్‌స్టాప్ పడింది. ఎందుకంటే... ఈ రోజు నుంచి చెన్నైలో ఈ సాంగ్ షూటింగ్ మొదలవుతోంది. దీని కోసం స్పెషల్‌గా రెండు సెట్స్ వేశారు. అందులో ఓ సెట్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొత్తగా కట్టిన ఫిల్మ్ స్టూడియోలో వేశారని సమాచారం. రెహమాన్ స్టూడియోలో షూటింగ్ జరుపుకోనున్న ఫస్ట్ సినిమా రజనీది కావడం విశేషం. నాలుగు రోజుల్లో ఈ పాటను పూర్తి చేయడానికి ప్లాన్ చేశారట.
ఈ సాంగ్‌లో స్పెషాలిటీ ఏంటంటే... చిన్న బిట్‌ను పాప్ కింగ్ మైకేల్ జాక్సన్‌ను మరిపించేలా తీస్తారట! ఈ పాటతో ‘2.0’ చిత్రీకరణ అంతా పూర్తయినట్లే. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏవైనా ఉంటే తర్వాత షూటింగ్ చేయాలనుకుంటున్నారు. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. ఈ నెల 27న దుబాయ్‌లో పాటల్ని, వచ్చే ఏడాది జనవరి 25న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment