బాసూ... రజనీ ఇక్కడ! | What 2.0's Other Villain Says About Rajinikanth, Akshay Kumar | Sakshi
Sakshi News home page

బాసూ... రజనీ ఇక్కడ!

Published Thu, Nov 10 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

బాసూ... రజనీ ఇక్కడ!

బాసూ... రజనీ ఇక్కడ!

మిలటరీ క్యాంప్‌లో గన్ షూటింగ్స్ జరుగుతాయి కానీ, సినిమా షూటింగ్స్ జరుగుతాయా? జరుగుతాయి బాసూ.. రజనీకాంత్ ఇక్కడ. ఆయన సినిమాకి పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా ఉంటారా? ‘2.0’ కోసం చెన్నైలోని మిలటరీ క్యాంప్ ప్రతినిధులను చిత్రబృందం పర్మిషన్ అడగ్గానే, ‘ఓ.. యస్’ అన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఇటీవల చెన్నై మిలటరీ క్యాంపులో చిత్రీకరించారు. ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు.

కాగా, హిందీ నటులు సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రలు చేస్తున్నారు. రజనీకాంత్, ఈ ఇద్దరూ, కథానాయిక అమీ జాక్సన్ తదితరులు పాల్గొనగా కొన్ని కీలకమైన సీన్స్ తీశారు. కాగా, ఈ నెల 20న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ఫస్ట్ లుక్ కోసం సూపర్ స్టార్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement