
ఆమె డ్యాన్స్ చాలా దారుణం..
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా అట్టహాసంగా జరిగిన ఐపీఎల్-10 ప్రారంభోత్సవంలో బ్రిటిష్ మోడల్, నటి యామీ జాక్సన్ తన డ్యాన్స్‌తో కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-10 ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా యామీ జాక్సన్ నృత్య ప్రదర్శనను నిర్వాహకులు ఏర్పాటుచేశారు. గ్రాండ్ కాస్ట్యూమ్స్‌తో తళుక్కుమన్న యామీ తనవంతు ప్రదర్శనతో ప్రారంభోత్సవాన్ని రక్తి కట్టించేందుకు ప్రయత్నించింది. అయితే, ఆమె డ్యాన్స్ నెటిజన్లను అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదట.
ఆమె డ్యాన్స్‌ను తప్పుబడుతూ ట్విట్టర్‌లో విమర్శలే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యామీ జాక్సన్ డ్యాన్స్ చాలా దారుణంగా ఉంది. ఆమె డ్యాన్స్‌ను చూసి 28మంది డ్యాన్స్ టీచర్లు తమ డ్యాన్స్ అకాడమీలను మూసుకొని.. కాశీకి వెళ్లారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. యామీ కన్నా విరాట్ కోహ్లి, సన్నీ లియోన్‌లు బాగా డ్యాన్స్ చేయగలరంటూ మరొకొందరు నెటిజన్లు చమత్కరించారు. ఈ రకంగా ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో యామీ జాక్సన్ డ్యాన్స్ మీద జోకులు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్-10 ప్రారంభోత్సవం స్థాయికి తగ్గట్టు ఆమె ప్రదర్శన లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
Amy Jackson's dance was so pathetic, 28 dance teachers closed their academy forever and went to Kashi. #IPL
— AstroNOT (@Stylebaaz) 5 April 2017
Sunny deol is a much better dancer than amy jackson
— Harshit Kanodia (@KanodiaHarshit) 5 April 2017
Virat Kohli can do better dance than Amy Jackson.. Lol #IPL
— Saumya