షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్‌ | actress Amy Jackson injured while ina shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్‌

Published Sat, Mar 18 2017 9:44 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్‌

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్‌

లండన్‌: ఓ యాడ్ షూటింగ్ కోసం లండన్‌ వెళ్లిన అమీ జాక్సన్ గాయపడింది. షూటింగ్ సందర్భంగా పరిగెత్తుతుండగా అనుకోకుండా జారి పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆమె కాలికి డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి ఏం పరవాలేదని చెప్పారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారని నటి సన్నిహితులు మీడియాకు తెలిపారు. అమీ స్వస్థలం లండన్ అన్న విషయం తెలిసిందే.
 
మొదట గాయాన్ని లెక్కచేయకుండా షూట్ కంటిన్యూ చేయగా.. నొప్పి ఎక్కువ కావడంతో యూనిట్‌కు చెప్పిందట. వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అమీ జాక్సన్‌ కు స్వల్ప గాయమేనని తెలియడంతో '2.0' మూవీ యూనిట్ రిలాక్స్ అయింది. ఎందుకంటే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా టాప్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ '2.0'లో హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ నటిస్తోంది. ఈ మూవీని దీపావళికి తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement