ఈసారి... ఆ సన ఈవిడేనట! | Gossip | Sakshi
Sakshi News home page

ఈసారి... ఆ సన ఈవిడేనట!

Published Wed, Oct 14 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

ఈసారి...  ఆ సన ఈవిడేనట!

ఈసారి... ఆ సన ఈవిడేనట!

 గాసిప్

మొన్నటి వరకు  ‘రోబో-2’ సినిమాలో నటించబోయే విలన్ గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ‘రోబో-2’కు రెగ్యులర్ విలన్  కాకుండా  హీరోతో సమానమైన విలన్  ఉండాలనేది డెరైక్టర్ శంకర్ కోరికట. దీని కోసం షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌ల నుంచి కమల్‌హాసన్ వరకు ప్రయత్నించారట. కానీ అది అంత సులభం కాదని అర్థమైంది. ఈ సైన్స్-ఫిక్షన్‌లో హీరో విక్రమ్ విలన్‌గా నటించనున్నాడనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఎవరినో ఎందుకు? ‘రోబో-1’లాగే రజనీకాంత్ వర్సెస్ రజనీకాంత్ ఫార్ములా ప్రకారం...రజనినే  విలన్‌గా పెట్టవచ్చు కదా అని కొందరు అంటున్నా...శంకర్ ససేమిరా అంటున్నాడట. విలన్ సంగతి పక్కనపెట్టండి, ఇప్పుడు హీరోయిన్ గురించిన చర్చ నడుస్తుంది.
 ఇంతకీ ‘రోబో-2’లో హీరోయిన్ ఎవరు? అని. మొదటి ‘రోబో’లో  ‘సన’గా ఐశ్వర్యరాయ్ గ్లామర్‌పరంగానే కాదు నటన పరంగా కూడా బోలెడు మార్కులు కొట్టేసింది. మరి ఆ  స్థాయిలో చేసే హీరోయిన్ ఎవరు?  ‘రోబో-2’లో దీపికా పడుకోణ్  నటిస్తుందనే వార్తలను ఆమె స్వయంగా ఖండించింది. అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేరు... ఆమీ జాక్సన్. శంకర్ ‘ఐ’ సినిమాలో ఈ బ్రిటన్ సుందరి హీరోయిన్‌గా చేసింది. ఆమె నటనకు మంచి మార్కులే వేశాడు శంకర్.

‘మదరాసపట్టినం’తో భారతీయ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆమీ ఆ సినిమాలో ఇంగ్లీష్ దొరసానిగా ప్రేక్షకులను మెప్పించింది. ‘ఏక్ దివాన థా’ సినిమాలో చక్కని నటన ప్రదర్శించింది. రాంచరణ్ ‘ఎవడు’ సినిమాతో తెలుగు ప్రేక్షలకూ దగ్గరైంది.సినిమా రంగంలో బలమైన సెంటిమెంట్లు  ఉంటాయి. విక్రమ్, ఆమీ జాక్సన్‌లు నటించిన ‘ఐ’ సినిమా పెద్దగా  ఆడలేదు. దీంతో ఆమీ జాక్సన్‌ను రిపీట్ చేసే ఛాన్సు లేదనేది కూడా ఒక టాక్. అయితే స్టార్ డెరైక్టర్ శంకర్  ‘సెంటిమెంట్’లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడని అనేవాళ్లు కూడా ఉన్నారు. చూద్దాం మరి... రోబో-2 ఎవరిని ప్రేమించనున్నాడో!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement