సూపర్‌స్టార్‌ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్ | Rajinikanth Robot 2.0 insured for Rs 350 crores? | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్

Published Sun, Feb 26 2017 3:43 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

సూపర్‌స్టార్‌ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్

సూపర్‌స్టార్‌ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ. ఎందిరన్ కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బ్రహ్మాండ చిత్రాల సృష్టికర్త శంకర్‌ దర్శకుడన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ. ఎందిరన్ కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బ్రహ్మాండ చిత్రాల సృష్టికర్త శంకర్‌ దర్శకుడన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఇందులో ఎమీజాక్సన్  కథానాయకిగానూ, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగానూ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ 2.ఓ చిత్రం తమిళం, హిందీ భాషల్లో 3డీ ఫార్మెట్‌లో తెరకెకు్కతోంది. పలువురు హాలీవుడ్‌ కళాకారులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్‌లో రజనీకాంత్‌ పాల్గొంటున్నారు.

ఏఆర్‌.రెహ్మాన్ గీత బాణీలు కడుతున్న 2.ఓ చిత్రాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి దర్శకుడు శంకర్‌ బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇనూ్సరెన్స్  చేసినట్లు తాజా సమాచారం. చిత్ర షూటింగ్‌లో జరిగే అసంభవాలు, విపతు్తలు,సెట్‌ ప్రాపర్టీ నష్టం ,ప్రాణ హాని లాంటి సంఘటలకు పరిహారం పొందడానికి ఈ ఇనూ్సరెన్స్  సాయపడుతుంది. ఇటీవల కొన్ని సినిమా షూటింగ్‌లలో ప్రాణ నష్టం, ధన నష్టం కలుగుతుండడంతో 2.ఓ చిత్ర నిర్మాతలు ఇనూ్సరెన్స్  చేసినట్లు తెలిసింది. 2.ఓ చిత్రాన్ని సెపె్టంబర్‌లో విడుదలకు సన్నాహాలు జరుగుతునట్లు సినీ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement