వివిధ గెటప్‌లలో ఆ ముగ్గురు | Akshay Kumar and rajini act differnt roles in robo 2.0 | Sakshi
Sakshi News home page

వివిధ గెటప్‌లలో ఆ ముగ్గురు

Published Mon, Apr 3 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

వివిధ గెటప్‌లలో ఆ ముగ్గురు

వివిధ గెటప్‌లలో ఆ ముగ్గురు

సూపర్‌స్టార్‌ 5 అయితే, అక్షయ్‌కుమార్‌ 12 అట. ఏమిటీ ఈ అంకెల గారడీ అనేగా మీ సందేహం. కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్న ప్రచారం ఇదే. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ. ఇందులో ఇంగ్లీష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ నాయకిగా నటిస్తున్న విషయం, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి విధితమే. లైకా సంస్థ సుమారు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకుడన్న విషయం తెలిసిందే. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న 2.ఓ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

2.ఓ చిత్రం గురించి ఇప్పటికే అనధికారికంగా పలు విషయాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ ఐదు గెటప్‌లలోనూ, ఎమీజాక్సన్‌ రెండు గెటప్‌లలోనూ, అక్షయ్‌కుమార్‌ ఏకంగా 12 గెటప్‌లలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి ఇంటర్నెట్‌లో పలువురు నిజమేనా అని ప్రశ్నిస్తుండడంతో స్పందించిన దర్శకుడు శంకర్‌ తన వెబ్‌సైట్‌లో సింపుల్‌గా నో అని పేర్కొన్నారు. మీడియాలో 2.ఓ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏదీ నిజం కాదని, తాము అధికారికంగా ప్రకటించేవరకూ ఏ విషయాన్ని నమ్మవద్దని చిత్ర వర్గాలు పేర్కొనడం గమనార్హం. మొత్తం మీద ఈ చిత్రంపై నానాటికీ ఆసక్తితో పాటు అంశాలు పెరిగిపోతున్నాయన్నది నిజం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement