
ఐశ్వర్యరాయ్.. అందానికే పర్యాయపదం ఈ పేరు. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే. ప్రతి ఒక్కరు అందాన్ని ఆమెతో పోల్చి చెబుతారు. అలాంటి అందమైన స్త్రీ భూమ్మీద మరొకరు ఉండరని అంటుంటారు. ఈ పిల్లికళ్ల బ్యూటీ 1994లోమిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
మిస్ వరల్డ్ అయిన తర్వాత ఆ కిరీటంతోనే కింద కూర్చొని భోజనం చేసింది ఐశ్యర్య. ఈ అరుదైన ఫొటోను ప్రముఖ నటి అమీజాక్సన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చెయ్యగా అది వైరల్ అవుతుంది. అందులో మిస్ వరల్డ్ కిరీటంతోనే మెరూన్ కలర్ చీరలో తల్లి బృందాతో కలిసి నేలపై కూర్చుని స్వహస్తాలతోనే భోజనం చేస్తున్నారు.
1994 లో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య మొదటి రన్నరప్. ఆమె కిరీటాన్ని సుష్మితా సేన్ చేతిలో కోల్పోయింది. తరువాత, ఇద్దరూ వరుసగా మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్నారు.
అమీ జాక్సన్ కూడా 2009లో మిస్ టీన్ వరల్డ్‌గా గెలుపొందారు. అంతేకాదు..2010 లో మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోటీల్లో రన్నరప్ కిరీటాన్ని గెలుపొందారు. 6 ఏళ్లకే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమీ పలు సినిమాల్లో కూడా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment