
రూటు మారింది!
ర్యాంప్ వాక్.. సినిమా షూటింగ్స్... ఇప్పుడు అమీ జాక్సన్ డైరీ ఫుల్ బిజీ. ఓ పక్క మోడలింగ్.. మరో పక్క సినిమాలు..
ర్యాంప్ వాక్.. సినిమా షూటింగ్స్... ఇప్పుడు అమీ జాక్సన్ డైరీ ఫుల్ బిజీ. ఓ పక్క మోడలింగ్.. మరో పక్క సినిమాలు.. క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ‘రోబో’కి సీక్వెల్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘2.0’లో అమీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో ఈ చిత్రం షూటింగ్‌కి హాజరయ్యారు. ‘లండన్ ఫ్యాషన్ వీక్’ ఉండడంతో ‘2.0’కి చిన్న గ్యాప్ ఇచ్చి అటు వెళ్లారామె.
ర్యాంప్‌పై హోయలొలికించిన తర్వాత ‘2.0’ షూటింగ్‌కి హాజరుకావడం కోసం లండన్ టు ఇండియా రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ, జర్నీ మధ్యలో దుబాయ్ లో ఆగక తప్పలేదట. ఎందు కంటే.. ‘2.0’ కాస్ట్యూమ్స్ సెలక్షన్ అట. అక్కడ షాపింగ్ చేసుకుని, అమీ ఇండియా చేరుకుంటారు. ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో అమి యాక్షన్ గర్ల్‌గా కనిపించనున్నారు.