హద్దులు దాటిన ఎమీ
తను ఇంగ్లిష్ భామనని నటి ఎమీజాక్సన్ మరో సారి అందరికీ గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్లలో ఎమీ పేరు చోటు చేసుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రెండవ సారి నటించే అవకాశం దక్కించుకున్న అరుదైన నటి ఎమీనే. అంతే కాదు అతి తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని పొందింది. ప్రస్తుతం 2.ఓ చిత్రంలో నటిస్తున్న ఎమీ ఇటీవల నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల్ని దుబాయ్‌లో హద్దులు మీరిన ఆనందంతో జరుపుకుందట.
ఆ దృశ్యాలను తనే స్వయంగా ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసి సంచలనానికి కారణమైంది.ఎమీ జాక్సన్ పోస్ట్ చేసిన నిశ్చల చాయాచిత్రాల్లో ఒక చిత్రం మాత్రం కుర్రకారును గిలిగింతలు పెట్టిస్తోంది. ఒక యువకుడి ఒడిలో తన అందాలతో కనువిందు చేస్తూ కూర్చునట్లున్న ఆ ఫొటో సోషల్ నెట్ వర్క్స్‌ల్లోనే కాకుండా తాజాగా ప్రింటు మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.ఆ ఫొటోలో ఎమీని ఒడిలో కూర్చోబెట్లుకుంది ఆమె తాజా బాయ్‌ఫ్రెండ్ అనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఎంతైనా ఎమీజాక్సన్ కెనడా బ్యూటీ కదా, ఏ విషయంలోనైనా మోతాదు ఎక్కువగానే ఉంటుంది అనే గుసగుసలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.