Directed by Shankar
-
ఆయన నుంచి చాలా నేర్చుకున్నా!
దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళ, భాషల్లో అగ్ర కథానాయకిగా రాణించిన నటి రకుల్ ప్రీత్ సింగ్. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గాయి. అయితే హిందీలో మాత్రం ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇకపోతే నటన కంటే గ్లామర్‌కే అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌కు గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం విశేషమే. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్– 2 చిత్రంలో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక నాయకిగా నటించారు. ఇందులో ఆమె నటుడు సిద్ధార్్థకు జంటగా నటించినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం జూలై 12వ తేదీన భారీ అంచనాల మధ్య తెరపైకి రానుంది. ఇటీవల విడుదలైన చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఇందులో నటించిన నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక భేటీలో పేర్కొంటూ ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు శంకర్ నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. గ్రేట్ దర్శకుడైన ఆయనతో కలిసి పని చేయడమే ప్రత్యేక రాయితీగా భావిస్తున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అద్భుతమైన దర్శకుడని, కథాపాత్రలను ఆయన చూసే విధానం, ఆయన ఆలోచనా విధానం, షూటింగ్ స్పాట్లో ఆయన సృజనాత్మకత ఇలా చాలా విషయాలను తాను నేర్చుకున్నానని చెప్పారు. ఇండియన్–2 చిత్ర షూటింగ్ తనకు నిజంగా మరచిపోలేని అనుభవాన్ని అందించిందని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. కాగా అవకాశాలు తగ్గడంతో ఈమె ఇప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని ఉపయెగించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తరచూ విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య శివకార్తికేయన్ సరసన నటించిన అయలాన్ చిత్రం హిట్ అయినా, రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదన్నది గమనార్హం. ఇంకా చెప్పాలంటే పెళ్లి అయిన తరువాత ఈమె కెరీర్ చాలా కుంటుపడిందనే ప్రచారం జరుగుతోంది. -
పారడైసు పావడేసుకొచ్చెనండి...
‘జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి... జరగండి జరగండి... పారడైసు పావడేసుకొచ్చెనండి...’ అంటూ పాట అందుకున్నారు రామ్‌చరణ్. ఈ జాబిలమ్మ ఎవరూ అంటే కియారా అద్వానీ. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. రామ్‌చరణ్ పుట్టినరోజు ప్రత్యేకంగా బుధవారం ‘జరగండి..’ లిరికల్ సాంగ్‌ను 150కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు. అనిత సమర్పణలో జీ స్టూడియోస్ అసోసియేష¯Œ తో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
ఫారిన్లో పాట
త్వరలో న్యూజిల్యాండ్‌లో ల్యాండ్ కానున్నారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ న్యూజిల్యాండ్‌లో ఆరంభం కానుందని తెలిసింది. ఈ నెల మూడోవారంలో రామ్‌చరణ్, శంకర్ అండ్ టీమ్ ఫారిన్ ప్రయాణం అవుతారు. ముందుగా న్యూజిల్యాండ్‌లోని అందమైన లొకేషన్స్‌లో రామ్‌చరణ్, కియారాలపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తారట. ఈ పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ స్టెప్స్ సమకూర్చనున్నారని తెలిసింది. ఈ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా ప్లాన్ చేశారట శంకర్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
హద్దులు దాటిన ఎమీ
తను ఇంగ్లిష్ భామనని నటి ఎమీజాక్సన్ మరో సారి అందరికీ గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్లలో ఎమీ పేరు చోటు చేసుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రెండవ సారి నటించే అవకాశం దక్కించుకున్న అరుదైన నటి ఎమీనే. అంతే కాదు అతి తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని పొందింది. ప్రస్తుతం 2.ఓ చిత్రంలో నటిస్తున్న ఎమీ ఇటీవల నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల్ని దుబాయ్‌లో హద్దులు మీరిన ఆనందంతో జరుపుకుందట. ఆ దృశ్యాలను తనే స్వయంగా ఇంటర్నెట్లో పోస్ట్ చేసి సంచలనానికి కారణమైంది.ఎమీ జాక్సన్ పోస్ట్ చేసిన నిశ్చల చాయాచిత్రాల్లో ఒక చిత్రం మాత్రం కుర్రకారును గిలిగింతలు పెట్టిస్తోంది. ఒక యువకుడి ఒడిలో తన అందాలతో కనువిందు చేస్తూ కూర్చునట్లున్న ఆ ఫొటో సోషల్ నెట్ వర్క్స్ల్లోనే కాకుండా తాజాగా ప్రింటు మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.ఆ ఫొటోలో ఎమీని ఒడిలో కూర్చోబెట్లుకుంది ఆమె తాజా బాయ్‌ఫ్రెండ్ అనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఎంతైనా ఎమీజాక్సన్ కెనడా బ్యూటీ కదా, ఏ విషయంలోనైనా మోతాదు ఎక్కువగానే ఉంటుంది అనే గుసగుసలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. -
ఇలియానాకేమయ్యింది?
నటి ఇలియానాకేమయ్యింది? పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఇలియానా ఇంతకుముందు టాలీవుడ్లో నెంబర్ ఒన్ స్థాయికి పోటీపడిన నటీమణుల్లో ఒకరు. అలాగే కోట్లు పారితోషికం డిమాండ్ చేసిన ఇలియానా తమిళంలో తెరంగేట్రం చేసిన చిత్రం కేడీ. ఆ చిత్రం తన కేరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ తరువాత శంకర్ దర్శకత్వం వహించిన నన్భన్ చిత్రంలో నటించేంత క్రేజ్‌ను సంపాందించుకున్నారు. అలాంటి సమయంలో ఇలియానాకు బాలీవుడ్ ఆశ పట్టింది. అది సహజమే అయినా అక్కడ అవకావాలను సద్వినియోగం చేసుకోలేక పోయారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఇలియానా చిత్రం ఒప్పందం సమయంలో కేటాయించిన కాల్షీట్స్ ప్రకారం షూటింగ్‌కు రారని, మధ్యాహ్నం తరువాతే లొకేషన్‌కు వస్తారని ఒక సన్నివేశం పూర్తయ్యేసరికి పేకప్ సమయం అవుతుందనే ఫిర్యాదులకు ఆస్కారం కల్పించడమే ఇలియానాకు అవకాశాలు కోల్పోయిందనేది చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక చిత్రం కూడా లేని ఇలియానా మళ్లీ దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారనీ తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 తెరకెక్కనున్న విషయం తెలిసి ఇటీవల ఆయన్ని కలిసి అవకాశం అడిగినట్లు కోలీవుడ్ టాక్. ఇతరుల కోసం పళ్లు ఇకిలించను కాగా ఇటీవల ఇలియానా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇతరులను సంతోష పరచడానికని నేను పళ్లు ఇకిలించను. ఒకరిగురించి పట్టించుకోవలసిన అవసరం నాకు లేదు. నా ఏకాంతాన్ని నేను గౌరవించుకుంటాను. కెమెరాముందు నటిస్తాను గానీ ఇతరుల కోసం 24 గంటలు నటించడం నాకు ఇష్టం ఉండదు. నా వ్యక్తిత్వం ఎవరికైనా నచ్చకపోతే అది వారి సమస్య. నన్నెవరయినా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసే ప్రయత్నం చేస్తే అతనికి నవ్వుతూ పోజులిచ్చేనటిని నేనుకాదు. హీరోయిన్ల వద్ద కొందరు సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారికి నేను దూరంగా ఉంటాను’.. అని పేర్కొన ఇలియానాకేమయ్యింది? అవకాశాలు లేక పోవడంతో అసహనానికి గురవుతోందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అతనొక్కడే బాయ్‌ఫ్రెండ్
హీరోయిన్లకు బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం అనేది సర్వసాధారణం. అయితే ఈ విషయాన్ని కొందరు ధైర్యంగా వెల్లడిస్తారు. మరి కొందరు మారుస్తారు. ఇక ఎమిజాక్సన్ లాంటి వారయితే ఎలాంటి విషయాలనైనా నిర్భయంగా చెప్పేస్తారు. ప్రస్తుత క్రేజీ నటీమణుల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరని చెప్పవచ్చు. తమిళంలో చేసింది రెండు చిత్రాలైనా విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది ఎమిజాక్సన్. వాటిలో తొలి చిత్రం మదరాసు పట్టణం విజయం సాధించగా రెండో చిత్రం తాండవం నిరుత్సాహపరచింది. ఇక హిందీలో నటించిన తొలి చిత్రం ఏక్ దివాన్ తా చిత్రం కూడా ఎమికి నిరాశనే మిగిల్చింది. అయినా గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ప్రతిష్టాత్మక చిత్రం ఐలో నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రంపై ఎమిజాక్సన్ చాలా ఆశలు పెట్టుకుంది. బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చడంలో జాణగా పేరు తెచ్చుకున్న ఈ లండన్ బ్యూటీ బాలీవుడ్ నటుడు ప్రతీక్‌తో ప్రేమాయణం నడిపి ఆ తరువాత అతనికి టాటా చెప్పింది. తాజాగా బాయ్‌ఫ్రెండ్ ఎవరన్న ప్రశ్న తనకున్న ఏకైక బాయ్‌ఫ్రెండ్, నటుడు ఆర్యనేనని పేర్కొంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, తాను లండన్‌కు చెందిన నటినని చెప్పింది. తమిళ సినిమాల్లో నటించడానికి చెన్నైకి వచ్చినప్పుడు తొలుత పరిచయమైన హీరో ఆర్యనేనని చెప్పింది. నిజం చెప్పాలంటే తనకిక్కడ తెలిసిన వారు చాలా తక్కువని బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకునే ఏకైక వ్యక్తి ఆర్యనేనని పేర్కొంది. తాను నటించిన ఐ చిత్రం విడుదల తరువాత మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే ధీమాను ఎమిజాక్సన్ వ్యక్తం చేస్తోంది.