‘జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి... జరగండి జరగండి... పారడైసు పావడేసుకొచ్చెనండి...’ అంటూ పాట అందుకున్నారు రామ్‌చరణ్. ఈ జాబిలమ్మ ఎవరూ అంటే కియారా అద్వానీ. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. రామ్‌చరణ్ పుట్టినరోజు ప్రత్యేకంగా బుధవారం ‘జరగండి..’ లిరికల్ సాంగ్‌ను 150కు పైగా థియేటర్లలో విడుదల చేశారు.
ఎస్‌ఎస్ తమన్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు. అనిత సమర్పణలో జీ స్టూడియోస్ అసోసియేష¯Œ తో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment