ఇలియానాకేమయ్యింది?
నటి ఇలియానాకేమయ్యింది? పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఇలియానా ఇంతకుముందు టాలీవుడ్‌లో నెంబర్ ఒన్ స్థాయికి పోటీపడిన నటీమణుల్లో ఒకరు. అలాగే కోట్లు పారితోషికం డిమాండ్ చేసిన ఇలియానా తమిళంలో తెరంగేట్రం చేసిన చిత్రం కేడీ. ఆ చిత్రం తన కేరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ తరువాత శంకర్ దర్శకత్వం వహించిన నన్భన్ చిత్రంలో నటించేంత క్రేజ్‌ను సంపాందించుకున్నారు. అలాంటి సమయంలో ఇలియానాకు బాలీవుడ్ ఆశ పట్టింది. అది సహజమే అయినా అక్కడ అవకావాలను సద్వినియోగం చేసుకోలేక పోయారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి.
ఇలియానా చిత్రం ఒప్పందం సమయంలో కేటాయించిన కాల్‌షీట్స్ ప్రకారం షూటింగ్‌కు రారని, మధ్యాహ్నం తరువాతే లొకేషన్‌కు వస్తారని ఒక సన్నివేశం పూర్తయ్యేసరికి పేకప్ సమయం అవుతుందనే ఫిర్యాదులకు ఆస్కారం కల్పించడమే ఇలియానాకు అవకాశాలు కోల్పోయిందనేది చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒక చిత్రం కూడా లేని ఇలియానా మళ్లీ దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారనీ తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 తెరకెక్కనున్న విషయం తెలిసి ఇటీవల ఆయన్ని కలిసి అవకాశం అడిగినట్లు కోలీవుడ్ టాక్. ఇతరుల కోసం పళ్లు ఇకిలించను కాగా ఇటీవల ఇలియానా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇతరులను సంతోష పరచడానికని నేను పళ్లు ఇకిలించను. ఒకరిగురించి పట్టించుకోవలసిన అవసరం నాకు లేదు. నా ఏకాంతాన్ని నేను గౌరవించుకుంటాను. కెమెరాముందు నటిస్తాను గానీ ఇతరుల కోసం 24 గంటలు నటించడం నాకు ఇష్టం ఉండదు.
నా వ్యక్తిత్వం ఎవరికైనా నచ్చకపోతే అది వారి సమస్య. నన్నెవరయినా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసే ప్రయత్నం చేస్తే అతనికి నవ్వుతూ పోజులిచ్చేనటిని నేనుకాదు. హీరోయిన్ల వద్ద కొందరు సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారికి నేను దూరంగా ఉంటాను’.. అని పేర్కొన ఇలియానాకేమయ్యింది? అవకాశాలు లేక పోవడంతో అసహనానికి గురవుతోందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.