
దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళ, భాషల్లో అగ్ర కథానాయకిగా రాణించిన నటి రకుల్ ప్రీత్ సింగ్. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గాయి. అయితే హిందీలో మాత్రం ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇకపోతే నటన కంటే గ్లామర్‌కే అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌కు గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం విశేషమే. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్– 2 చిత్రంలో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక నాయకిగా నటించారు. ఇందులో ఆమె నటుడు సిద్ధార్‌్థకు జంటగా నటించినట్లు తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం జూలై 12వ తేదీన భారీ అంచనాల మధ్య తెరపైకి రానుంది. ఇటీవల విడుదలైన చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఇందులో నటించిన నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక భేటీలో పేర్కొంటూ ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు శంకర్ నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. గ్రేట్ దర్శకుడైన ఆయనతో కలిసి పని చేయడమే ప్రత్యేక రాయితీగా భావిస్తున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అద్భుతమైన దర్శకుడని, కథాపాత్రలను ఆయన చూసే విధానం, ఆయన ఆలోచనా విధానం, షూటింగ్ స్పాట్‌లో ఆయన సృజనాత్మకత ఇలా చాలా విషయాలను తాను నేర్చుకున్నానని చెప్పారు.
ఇండియన్–2 చిత్ర షూటింగ్ తనకు నిజంగా మరచిపోలేని అనుభవాన్ని అందించిందని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. కాగా అవకాశాలు తగ్గడంతో ఈమె ఇప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని ఉపయెగించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తరచూ విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య శివకార్తికేయన్ సరసన నటించిన అయలాన్ చిత్రం హిట్ అయినా, రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదన్నది గమనార్హం. ఇంకా చెప్పాలంటే పెళ్లి అయిన తరువాత ఈమె కెరీర్ చాలా కుంటుపడిందనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment